పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/238

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

236

చ. పెక్కు మతములు చెప్ప బెరసి వేదములందు
దక్క శ్రీవేంకటేశుమతము గన్నట్టు
వక్కణింప ఘను లెటువలెనైనా నడతురు
చక్కని మంచితనమే సంతోషించవలయు

రేకు:0368-01 గుజ్జరి సంపుటము:04–399
పల్లవి: ఇతరములన్నియు నడుమంత్రములే యెంచిచూచినను యింతాను
హితవగుబందుగుఁ డీశ్వరుఁడొకఁడే యితని మరవకుమీ జీవాత్మా

చ. భవకూపంబుల బడలెడినాఁడు పాయనిబంధువుఁ డితఁడొకఁడే
దివిస్వర్గంబునఁ దేలెడినాఁడు తిరుగఁబాయకెపుడితఁడొకఁడే
నవనరకంబుల నలఁగెడినాఁడు నటనలఁ బాయఁ డితఁడొకఁడే
యివలనవలహృదయేశుఁడు విష్ణుఁడు యీతని మరవకుమీ జీవాత్మా

చ. పశుమృగాదుల వొడలెత్తినప్పుడు పాయనిబందుగుఁడితఁడొకఁడే
విశదపు దుఃఖపువేళలనైనా విడువనిబంధువుఁ డితఁడొకఁడే
శిశువైనప్పుడు వృద్దెనప్పుడు చిత్తపుబందుగుఁడితఁడొకఁడే
దశావతారపు విషఁడొకఁడే యితఁడని తలఁచుమీ జీవాత్మా

చ. భావజకేలినిఁ జొక్కినప్పుడును ప్రాణబంధువుఁ డితఁడొకఁడే
యీవల నావల నిహపరములలో నిన్నిటిబంధువుఁ డితఁడొకఁడే
దైవము దానని శరణనియెడు నను దగ్గరికాచెను యితఁడొకఁడే
శ్రీవేంకటగిరి నాయకుఁ డితఁడే చేరి భజించుము జీవాత్మా

రేకు: 0364-02 లలిత సంపుటము:04-376
పల్లవి: ఇతరమెరఁగ గతి యిదియె శరణ్యము
సతతపూరునికి శరణ్యము

చ. సర్వలోకముల సాక్షైకాచిన -
సర్వేశ్వరునకు శరణ్యము
వుర్వికి మింటికి నొక్కటఁ బెరిగిన -
సార్వభౌమునకు శరణ్యము

చ. శ్రీకాంత నురముచెంగట నిలిపిన -
సాకారునకును శరణ్యము
పైకొని వెలిఁగేటి పరంజోతియై -
సౌకుమారునకు శరణ్యము

చ. తగనిహపరములు దాసుల కొసంగేటి
జగదీశ్వరునకు శరణ్యము
నగు శ్రీ వేంకటనాథుఁడ నీకును
సగుణమూర్తి యిదె శరణ్యము

రేకు:0140–03 వరాళి సంపుటము: 02-174
పల్లవి: ఇతరుల దూరనేల యెవ్వరూ నేమి సేతురు
మతి వారూఁ దమవంటి మనుజులే కాక

చ. చేరి మేలు సేయఁ గీడు సేయ నెవ్వరు గర్తలు
ధారుణిలో నరులకు దైవమే కాక
సారెఁ దనవెంటవెంటఁ జనుదెంచేవారెవ్వరు
బోరునఁ జేసిన పాపపుణ్యాలే కాక

చ. తొడఁగి పొగడించాను దూషించా ముఖ్యులెవ్వరు
గుడికొన్న తనలోని గుణాలే కాక
కడుఁగీర్తి నపకీర్తి గట్టెడివారెవ్వరు
నడచేటి తనవర్తనములే కాక

చ. ఘనబంధమోక్షాలకుఁ గారణ మిఁక నెవ్వరు
నని చిన జ్ఞానాజ్ఞానములే కాక