పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/237

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

235 చ. యిరవైన శబరిరుచులివియె నైవేద్యమై పరగెనట శేషమును బహునిషేధములనక ధర దదీయప్రసాదపు విశేషమేకాదె సిరుల శ్రీవేంకటేశ చెల్లుబడులాయ రేకు:0014-04 సామంతం సంపుటము: 01-086 పల్లవి: ఇతరము లిన్నియు నేమిటికి మతిచంచలమే మానుట పరము చ. ఎక్కడిసురపుర మెక్కడివైభవమెక్కడి విన్నియు నేమిటికి యిక్కడనే పరహితమునుఁ బుణ్యము గక్కునఁ జేయఁగఁ గల దిహపరము చ. యెవ్వరు చుట్టము లెవ్వరు బంధువు లెవ్వరిందరును నేమిటికి రవ్వగులక్షీరమణునిఁ దలఁపుచు యువ్వలC దాఁ సుఖ9Oయించుట పరము చ. యెందరు దైవము లెందరు వేల్పులు యెందరిందురును నేమిటికి కందు వెఱిఁగి వేంకటగిరిరమణుని చిందులేక కొలిచిన దిహపరము రేకు:0250-06 శంకరాభరణం సంపుటము: 03-289 పల్లవి: ఇతరము లేదిఁక నెంచి చూచితేఁ బ్రతివచ్చు నితఁడు ప్రత్యక్షమై చ. సకలలోకములు చర్చించి వెదకిన వొకఁడేపో పురుషోత్తముఁడు ప్రకటము బహురూపములయి నాతఁడు అకుటిలమహిమల యనంతుఁడే చ. పర్విన జీవుల భావించి చూచిన సర్వాంతరాత్ముఁడు సర్వేశుఁడే వుర్విని వెలుపలనుండిన యూతఁడు నిర్వహించె నీ నీరజాక్షుఁడే చ. చన్నకాలమున మన్నకాలమున నున్నవాఁడు యీవు పేంద్రుఁడే కన్నులెదుట నిఁకఁ గల కాలంబును అన్నిటా శ్రీవేంకటాధీశుఁడే పె.అ.రేకు:0057-01 దేసాక్షి సంపుటము: 15-322 పల్లవి: ఇతరము లేమియును నెంచవలదు తతిఁ దానే మేలువాఁడై తలకొనవలయు చ. అన్ని పదార్ధము లమ్మ నంగళ్లలోపల తిన్నఁగా మంచివే కొని తెచ్చుకొన్నట్టు పన్ని నానా ధర్మములు ప్రాణుల కెల్లాఁ గలవు అన్నిటా మంచితనాన కానందించవలయు చ. తెరువు లెన్ని గలవు దేశములమీఁదికి హరిఁ బుణ్యతీర్ధముల కరగినట్టు వొరసితే విప్టులందు నుండు బహుగుణములు నిరుల మంచితనాలే చేపట్టగవలయు