పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/236

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

234 సహజపుఁ గర్తె జరపేటివాఁడు చ. అతిదుఃఖకరము లాసలు సతత్ర సుఖకరము సమవిరతి గతి యలమేల్మంగతో శ్రీవేంకట పతి యొకఁడిన్నిటఁ బాలించువాఁడు రేకు:0208-02 దేవగాంధారి సంపుటము: 03-044 పల్లవి: ఇతర దేవతల కిది గలదా ప్రతి వేరీ నీ ప్రభావమునకు చ. రతిరాజజనక రవిచంద్రనయన అతిశయ శ్రీవత్సాంకుఁడవు పతరేంద్రగమన పద్మావతీపతి మతి నినుఁ దలఁచిన మనోహరము చ. ఘనకిరీటధర కనకాంబర పా వనక్షీరాంబుధివాసుడవు వనజచక్రధర వసుధావల్లభ నినుఁ బేరుకొనిన నిర్మలము చ. దేవపితామహ త్రివిక్రమ హరి జీవాంతరాత్మక చిన్మయుఁడా శ్రీవేంకటేశ్వర శ్రీకర గుణనిధి నీవార మనుటే నిజసుఖము రేకు: 0302-05 సామంతం సంపుటము: 04-011 పల్లవి: ఇతర మేదియు లేదు యొఱఁగ మింతేకాని రతికెక్కేపనులెల్లా రామచంద్రుఁడే పో చ. ధనమై చేరేవాఁడు దైవమై కాచే వాఁడు మనసులోదలఁచేటి మాధవుఁడే మునుకొన్న గ్రామములై ముందర నుండే వాఁడు కొననాలుక మీఁదటి గోవిందుఁడే పాశీ చ. తల్లియై పెంచేవాఁడు తండ్రియై పుట్టించే వాఁడు వెల్లవిరిఁ దాఁగొలిచే విష్ణుమూరితి ఇల్లాలై సుఖమిచ్చి యెంచఁ బుత్రులైన వాఁడు చెల్లుబడిఁ దా మొక్కేటి చేతిపై శ్రీహరియే చ. దేహమై వుండేటివాఁడు దినభోగమైన వాఁడు యీహల శ్రీవేంకటేశుఁడితఁ డొక్కఁడే మోహాచారమైన వాఁడు మోక్షమై నిలిచే వాఁడు సాహసించి నమ్మఁగల సర్వేశుఁడితడే రేకు:0083-01 ఆహిరి సంపుటము: 01-399 పల్లవి: ఇతరధర్మము లందు నిందు గలదా మతిఁ దలపఁ పరము నీమతముననే కలిగె చ. విదురునకుఁ బరలోకవిధి చేసెనట తొల్లి అదె ధర్మసుతుఁడు వర్ణాశ్రమంబులు విడిచి కదిసి నీదాసుఁడై న కతముననే కాదె యినా - యెదురనే తుదిపదం బిహముననే కలిగె చ. అంటరాని గద్దకుల మంటి జటాయువుకు నీ వంటి పరలోకకృత్యములు సేసితివి మును వెంట నీ కైంకర్యవిధి కలిమినేకాదె వొంటి నీహస్తమున నోగ్యమై నిలిచె