పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/235

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

233 లలి విద్యలెల్ల ఖ్యాతిలాభపూజల కొరకే పలుమంత్రము లెల్లను బ్రహ్మలోక మీసందివె వొలిసి ఇష్టార్థసిద్ధి కొక్కఁడే దేవుఁడు చ. అనుదిన రాజ సేవ లల్పార్ధ హేతులే కొనఁ గల్పవృక్షమైనఁ గోరిన విచ్చేటిదే ఘన శ్రీవేంకటేశుఁడు కల్పించె జీవునిఁ గావనొనర నిష్ణార్థసిద్ధి కొక్కఁడే దేవుఁడు రేకు:0264-04 సామంతం సంపుటము: 03–370 పల్లవి: ఇతనికంటే మరి దైవముఁ గానము యొక్కడ వెదకిన నితఁడే అతిశయమగు మహిమలతో వెలసెను అన్నిటి కాధారము దానె చ. మది జలధుల నొక దైవము వెదకిన మత్స్యావతారం బితఁడు అదివో పాతాళమందు వెదకితే నాదికూర్మ మీవిష్ణుఁడు పొదిగొని యడవుల వెదకి చూచితే భూవరాహమని కంటిమి చెదఱక కొండల గుహల వెదకితే శ్రీనరసింహం బున్నాఁడు చ. తెలిసి భూనభోంతరమున వెదకిన త్రివిక్రమాకృతి నిలిచినది బలువీరులలో వెదకి చూచితే పరశురాముఁ డొకఁడై నాఁడు తలఁపున శివుఁడునుఁ బార్వతి వెదకిన తారకబ్రహ్మము రాఘవుఁడు కెలఁకుల నావులమందల వెదకిన కృష్ణుఁడు రాముఁడునైనారు చ. పొంచి యసురకాంతలలో వెదకిన బుద్ధావతారంబైనాఁడు మించిన కాలము కడపట వెదకిన మీఁదటి కల్క్యావతారము అంచెల జీవులలోపల వెదకిన నంతర్యామై మొరసెను యెంచుక ఇహమునఁ బరమున వెదకిన యీతఁడే శ్రీవేంకటవిభుఁడు పె.అ.రేకు:0020–05 బౌళి సంపుటము: 15–115 పల్లవి: ఇతనిచందము హరిహరి యేమి చెప్పఁ గొలఁది హరిహరి అతిరహస్యముల హరిహరి అదిగో మనకుఁ జిక్కె హరిహరి చ. ఆదివిష్ణుఁడితఁడు హరిహరి అదె యశోదకొడుకు హరిహరి వేదమూర్తి ఇతఁడె హరిహరి వెన్నదొంగిలించె హరిహరి సాదుబండి విఱిచె హరిహరి చంటివిషము చెలిచె హరిహరి చ. పరమపరుషుఁడితఁడు హరిహరి పసులఁ గాచె నిదివో హరిహరి సిరికి మగఁడు దాను హరిహరి చెలఁగి రోలఁ దగిలె పూలహరి పరగఁ జూడరోయి హరిహరి బదుకరోయి కొలిచి హరిహరి చ. అమరవంద్యుఁడితఁడు హరిహరి అణఁచెఁ గంసుని హరిహరి వినుత దానవాలి పూలిపూలి వించె ಮಿಯ್ಗಲು పూలిపూలి అమరె నిదివో హరిహరి శ్రీ వేంకటాద్రిమీఁద హరిహరి జమళి రామకృష్ణుఁడు హరిహరి సర్వమితఁడు హరిహరి రేకు:0204-04 గుండక్రియ సంపుటము: 03-022 పల్లవి: ఇతర చింత లిఁక నేమిటికి అతఁడే గతియై అరసేటివాఁడు చ. కర్మమూలమే కాయము నిజధర్మమూలమే తన యాత్మ అర్మిలి రెంటికి హరియొకఁడే మర్మ మీతఁడే మనిపేటివాఁడు చ. బహుభోగమయము ప్రపంచము నిహితజ్ఞానము నిజముక్తి ఇహపరములకును యీశ్వరుఁడే