పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/234

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

232 చ. వొనరిన కలలో నొకసంసారము మనసుతోడనే మలసీని ననిచి యందుకును నారాయణుఁడై కొనమొదలై తా గురియైనాడు చ. వుడిబడి కోర్కుల నొకసంసారము బడిబడి యాసలఁ బరగీని విడువక యిది శ్రీవేంకటేశ్వరుఁడే తొడిఁబడఁ గల్పించి ధ్రువమయినాఁడు రేకు:0253-05 గుజ్జరి సంపుటము:03-306 పల్లవి: ఇతని మఱచితిమి యెదుటనే యుండఁగ యిన్నాళ్లును నే మెరఁగక ప్రతిలేదితనికి జీవకోట్లకుఁ బ్రాణబంధుఁ డితఁడు చ. ముందు నేను ఘనగర్బనరకమున మునిఁగియున్ననాఁడు బొందితోడనే సుఖదుఃఖంబులఁ బొరయు తోడునీడితఁడు అంది స్వర్గనరకాదులు చొచ్చిన అక్కడఁ దా వెనువెంటనే చందపు నాయాతుమలోఁ బాయని సర్వాత్మకుఁ డితడే చ. ఆని పట్టి నేఁ బాపపుణ్యములు అనుభవించవలెనన్నప్పుడు మానుపనొల్లఁడు తాఁ బెరరేఁచును మతి కనుకూలం బితఁడు నానావిధులనుఁ బొరలి యలపుతో నలి నే నిద్రించేటప్పుడు తానును ఆపరిణామంబులకు తగులైవుండును యీతఁడు చ. తలఁచిన దగ్గరుఁ దడవక యుండిన దవ్వయివుండు నితఁడు కలసి మెలసి ఇహపరము లొసంగఁగఁ గాచుకవుండును యినాతఁడు మెలఁగుచు సాకారముతో నున్నాఁడు మేటిశ్రీవేంకటపతి యీతఁడు వలసిన వావులరూపులు దాల్చినవాఁ డొకఁడేపో యీతఁడు రేకు:0205-04 శ్రీరాగం సంపుటము: 03-028 పల్లవి: ఇతనికంటె ఘను లిఁక లేరు యితర దేవతల యిందరిలోన చ. భూపతి యినాతఁడె పాaదిగి కొలువరో శ్రీపత్రి యియాత్రcడే చేకొనరో యేపున బలువుఁడు నీతఁడే చేరరో పైపై వేంకటపతి యైనాఁడు చ. మరుగురుఁడితఁడే మతి నమ్మఁగదరో పరమాత్ముఁ డితఁడె భావించరో కరివరదుఁ డితఁడె గత్రియని త్రలఁచరో పరగ శ్రీవేంకటపతి యైనాఁడు చ. తల్లియు నితఁడే తండ్రియు నితఁడే వెల్లవిరై యిఁక విడువకురో చల్లగా నితని శరణని బ్రతుకరో అల్ల శ్రీవేంకటహరి యయినాఁడు రేకు: 0213-01 దేసాక్షి సంపుటము: 03-073 పల్లవి: ఇతనికంటే నుపాయ మిఁక లేదు మతిలోన నున్నవాఁడు మర్మమిదే సుండీ చ. ఇన్ని లోకసుఖములు ఇంద్రియప్రీతులే తన్నుఁ గనిన తల్లిదండ్రి తను పోషకులే కన్ను లెదిటిధనాలు కారణార్థములే వున్నతి నిష్ణార్థసిద్ధి కొక్కఁడే దేవుఁడు చ. కల దేవత లిందరు కర్మఫలదాతలే