పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/233

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

231 చ. కొండ వెల్లగించెఁ దొల్లి గోవర్ధనుఁడతఁడు కొండతో సంజీవియెత్తెఁ గోరి యితఁడు గుండు గరఁచె నహల్యకొరకు సీతాపతి గుండు గరఁగఁగఁ బాడె కోరి యితఁడు చ. అంజనా చలముమీఁద నతఁడు శ్రీ వేంకటేశుఁ డంజనీ తనయుఁ డాయ ననిలజుఁడు కంజాప్తకులరామఘనుఁడు దానును దయా - పుOజమాయ మOగాబుధి హనుమంతుడు రేకు: 0351-02 పళవంజరం సంపుటము: 04-298 పల్లవి: ఇతఁడొకఁడే సర్వేశ్వరుఁడు సితకమలాక్షుఁడు శ్రీవేంకటేశుఁడు చ. పరమయోగులకు భావనిధానము అరయనింద్రాదుల కైశ్వర్యము గరిమ గొల్లెతల కాఁగిటిసౌఖ్యము సిరలొసఁగేటియూ శ్రీవేంకటేశుఁడు చ. కలిగి యశోదకు కన్నమాణికము తలఁచినకరికిని తగుదిక్కు అలదైపదికిని యాపద్భంధుడు చెలరేఁగినయినా శ్రీవేంకటేశుఁడు చ. తగిలినమునులకు తపములసత్పలము ముగురువేలుపులకు మూలము వొగి నలమేల్మంగకొనరిన పతితఁడు జిగిమించినయూ శ్రీవేంకటేశుఁడు రేకు:0181-03 నాట సంపుటము: 02-405 పల్లవి: ఇతని కితఁడేకాక యితరులు సరియా మిత్రి లోకా లిత్రని మేనిలోనే కావా చ. కమలనాభుని భయంకరకోపముతోడ రమణ వేరొకరివరంబులు సరియా తమితోడఁ దల దుంచి తగినవరము లిచ్చె అమరఁగ నరకాసురాదులకు నిత్రCడు చ. కరివరదుని పేరుగలసిన తిట్లతో పరదేవతల మంత్రపఠనలు సరియా నిరతి శిశుపాలుని నిందకు శిక్షించి పరలోక మిచ్చినట్టి భావము వినరా చ. చలిమి శ్రీవేంకటేశు శరణాగతితోడ బలిమి మించిన బ్రహ్మపట్టము సరియా వొలిసిన ధ్రువునకు వున్నతలోక మిచ్చె అల బ్రహ్మలోకమున కదె మీఁ దెఱఁగరా రేకు:0198–03 శంకరాభరణం సంపుటము: 02-504 పల్లవి: ఇతని ప్రసాదమే యిన్నియును గతి యితనిదే కన కాదనరాదు చ. కాయములో నొకఘనసంసారము ప్రాయంబులతోఁ బ్రబలీని ఆయ మందుకును హరి దానేయె దాయక పాయక తగిలున్నాఁడు