పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/230

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

228 చ. లోకము శ్రీపతియాజ్ఞలో తత్త్యాలిరువదినాలు కైకొని సేఁతలు సేసీఁ గర్తలు లేరు సాకిరింతే జీవుఁడు స్వతంత్రుఁడు దేవుఁడు యీకొలఁది గని సుఖియించుటే సుజ్ఞానము చ. కాలము దైవము సృష్టి కలి మన్యుల భాగ్యము (?) వాలాయించి యెవ్వరికి వచింపరాదు యీలీలలు శ్రీవేంకటేశునివి ఆచార్యుఁడు తాలిమిఁ జెప్పగా విని తలఁచుటే సుజ్ఞానము రేకు:0198–02 మాళవిగౌళ సంపుటము: 02-503 పల్లవి: ఇట్టె మమ్ము రక్షించుట యేమిదొడ్డ నీకు నేఁడు బట్టబాయిటనే నీవు పదిరూపు లైతివి చ. చదువుల చిక్కుదిద్ది చక్కఁగఁ జేసితివి మొదలఁ గుంగినకొండ మోఁచి యెత్తితి పొదిగి చేపట్టి తెచ్చి భూమి వుద్ధరించితివి అదనునఁ బ్రహ్లాదు నట్టె మన్నించితివి చ. అడుగులు మూఁటనే యఖిలము గొలచితి బడిబడినే రాచపగ నీఁగితి బెడిదపు లంక విభీషణు నేలించితివి అడరి పాండవులదిక్కె నిలిచితివి చ. త్రిపుర కాంతలగుట్ట దీర బోధించితివి వుపమఁ గలికిరూపై యున్నాఁడవు ఇపుడు శ్రీవేంకటేశ యేలితివి లోకాలెల్ల యెపుడు నుతులకు నిరవైతివి పె.అ.రేకు:0050-02 సామంతం సంపుటము: 15-282 పల్లవి: ఇట్టే నా సేవలును యిచ్చేటి నీ యీవులను గట్టిగా నే నల్పుఁడను ఘనుఁడవు నీవు చ. చిన్ననిమ్మపండే కాదా చేతి కిచ్చి రాజులచే యొన్న రాని భూములకు నేలికయ్యేది పన్ని పేరుకొని యొకపద్యము చెప్పేకాదా సన్నల సర్వార్ధములు భాగము గొనేది చ. గవ్వవేసి తూచి కాదా ఘనమైనవజ్రము చివ్వనను విలువలు చేసుకొనేది అవ్వల జుట్టెడు తాఁటియాకువాసి వేసి కాదా యెవ్వరిచే ధనమైనా నిప్పించుకొనేది చ. కసవుకట్టలు వేసి కాదా గోవులచేత కొసరుచుఁ బాలిప్పించుకొనియెడిది యెసఁగ శ్రీవేంకటేశ యిట్టే నేను మొక్కి కాదా పసగల నీ కృపకుఁబాత్రుఁడ నైనది రేకు:0150-06 సామంతంసంపుటము:02-234 పల్లవి: ఇట్లానే యోగలక్ష్య మెఱుఁగుకొంటే ఫలించు యెట్టయినా గురువాక్య మేమరకుండీ చ. కాంతఁ దలచుకొంటేనే కామోద్రేకము వుట్టు యింతలోఁ గూడెనా యేడకేడ సూత్రము చింతకాయతొక్కు చూచితేనే నోరూరు యెంతకెంతదవ్వు యేడకేడ సూత్రము