పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/231

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

229 చ. వీనుల మంచిమాటలు వింటేనే సంతోష ముబ్బు యేనిజము గనె నేడకేడ సూత్రము ఆనించితే నాలుకనే ఆరురుచులుఁ దెలిసీ యీనెపమున నేడకేడ సూత్రము చ. ముక్కుకొనఁ బ్రాణ ముండి ముందువెనుకకు వచ్చి యొక్కడ మోచున్న దేడకేడ సూత్రము చిక్కి శ్రీవేంకటేశుఁడు జీవుల కంతర్యామి యిక్కు వెఱిఁగితే నీడ కిదే సూత్రము రేకు:0021-02 శ్రీరాగం సంపుటము: 01-126 పల్లవి: ఇతఁడు చేసిననేఁత లెన్నిలేవిలమీఁద యితఁడు జగదేకగర్వితుఁడౌనో కాఁడో చ. కుడువఁడా ప్రాణములుగొనుచుఁ బూతకిచన్ను తుడువఁడా కపటదైత్యులనొసలి వ్రాలు అడువఁడా నేలతో నలమి శకటాసురుని వడువఁడా నెత్తురులు వసుధ కంసునివి చ. పెట్టఁడా దనుజారిబిరుదు లోకమునందు కట్టఁడా బలిదైత్యు కర్మబంధముల మెట్టఁడా కాళింగు మేటిశిరములు, నలియఁగొట్టఁడా దానవులఁ గోటానఁగోట్ల చ. మరపు(డా )ುವೊಲು మరణములుఁ బ్రాణులకు పురపCడా గంగఁ దనపాదకమలమున చెరుపఁడా దురితములు శ్రీ వెంకటేశుఁడిదె నెరపఁడా లోకములనిండఁ దనకీర్తి రేకు: 0327-06 బౌళి సంపుటము:04-159 పల్లవి: ఇతఁడు తారకబ్రహ్మ మీతఁడు సర్వేశ్వరుడు రతికెక్కఁ గొలిచిన రక్షించు నితఁడు చ. తరణివంశజుడై తాటకను హరియుంచి అరుదుగ విశ్వామిత్రుయూగము గాచి హరునివిల్లు విరిచి యట్టె సీతఁ బెండ్లియాడి పరశురాముని నిజబలిమి చేకొనెను చ. మునులకభయమిచ్చి మొగి నసురలఁ ద్రుంచి ఘనమైన మాయామృగముఁ జంపి కినిసి వాలిఁ గొట్టి సుగ్రీవునిఁ బట్టముగట్టి వనధి బంధించి లంక వడిఁ జట్టుముట్టెను చ. బలురావణునిఁ జంపి పుష్పకముపైఁ దాఁ జేకొని లలి విభీషణునకు లంక ఇచ్చి చెలఁగి యయోధ్య యేలి శ్రీవేంకటాద్రిమీఁద వెలయ రాముఁడు దానై విశ్వమెల్లా నేలెను రేకు:0148–02 మాళవి సంపుటము: 02-218 పల్లవి: ఇతఁడు రామునిబంటు యితని కెవ్వ రెదురు చతురత మొరసె నిచ్చట హనుమంతుఁడు చ. అకాస (శ?) మంతయు నిండి యవ్వలికిఁ దోఁక చాఁచి పైకొని పాతాళానఁ బాదాలు మోపి కైకొని దశదిక్కులు కరములఁ గబళించి సాకారము చూపినాఁ డిచ్చట హనుమంతుఁడు