పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/229

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

227 చ. దిట్టయై యేనుగులచే దీకొలిపిన వాఁటి నట్టె కొమ్మలు తమరైపోయను పట్టియెత్తి రాలమీఁద బలుమారు వేసిన బట్టబయలే దూదిపానుపులై నిలిచె చ. కడసారెఁ గంభములోఁ గలఁడంటేఁ గలిగి చిడుముడి రక్కసులఁ జీరివేసె జడియు శ్రీ వేంకటాచల నారసింహుఁడై పొడచూపి మాకు దిక్కె పొదలించె నేఁడు రేకు:0164-06 శ్రీరాగం సంపుటము:02-311 పల్లవి: ఇట్టివాఁడవు సులభమెట్లా నైతివోకాక అట్టి నీదయ దలఁచి అరుదయ్యి నాకు చ. యేమేమి చదువవలె నెందరి నడుగవలె ఆముక నిన్నుఁ దెలిసే యందుకొరకు భూమిలోన నెంతేసి పుణ్యములు సేయవలె కామించి నీపై భక్తి గలిగేటికొరకు చ. యెన్నిజన్మాలెత్తవలె నెందెందు వెదకవలె కన్నుల నీసాకారము గనేకొరకు వున్నతి నెంతగాలము వొగ్గి కాచుకుండవలె విన్నవించి నీసేవ వేఁడుకొనే కొరకు చ. యేదేది యొఱఁగవలె యెట్లభ్యసించవలె నీదాసుఁ డనిపించుకొనేటికొరకు సాదరాన శ్రీవేంకటేశ్వర నన్ను మన్నించితివేదెసఁ బొగడవలె యింత సేసేకొరకు పె.అ.రేకు: 0032-01 లలిత సంపుటము: 15-177 పల్లవి: ఇట్టివాని నన్ను దైవ మెట్టుగాచెను నట్టనడుమ నిదియే నాకు వెఱగాయెను చ. పరసతి పరధన పరనిందలకు రోయ యిరవై పెద్దలలోన యెట్టున్నాడనో హరి సేవ గురుసేవ అవియుఁ జేయుట లేదు సరవి నింకా నేమి చదివేనో చ. పాపమును కోపమును పట్టిన చలము మాన యేపున విజ్ఞాని నంటా యేమి సేసేనో పై పై సన్మార్గము పట్టదు నా మతిలోన దాపగు తత్త్యము నెట్టు తలపోసెనో చ. మోహమును దాహమును ముందు వెనకా నెఱుఁగ ఆహా విరక్తుఁడ నే ననుట యెట్టు వోహో శ్రీ వేంకటేశుఁ డొలిసి మన్నించెఁ గాక సాహసించి నే నెట్టు శరణంటినో రేకు:0237-02 దేసాక్షి సంపుటము: 03-211 పల్లవి: ఇట్టె జ్ఞానమాత్రమున నెవ్వరైనా ముక్తులే పుట్టుగులు మరి లేవు పొందుదురు మోక్షము చ. అతిసూక్ష్మ మీయాత్మ అందులో హరి యున్నాఁడు కత్రలే వినుటగాని కానరాదు క్షితి దేహాలు ప్రకృతిఁ జెందిన వికారములు మతి నిది దెలియుటే మహిత సుజ్ఞానము