పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/228

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

226 చ. తడవి వేఁపచేఁదు త్రావెడివాఁడు ఎడయెడఁ దినుఁ దీపేమైనను అడరు సంసారికి నదియు లేదాయ కడుఁ జేఁదెకాని యొక్కడఁ దీపులేదు చ. దొరకొని హేయమే తోఁడేటివాఁడు పరిఠవించును మేనఁ బరిమళము అరిది సంసారికి నదియు లేదాయ ఇరవు వేంకటపతి నెఱుఁగలేఁడు రేకు: 0387-05 నాట సంపుటము: 04-508 పల్లవి: ఇట్టి సుద్దులితనివి ఇదివో కొలువున్నాఁడు నట్టనడుమ నీ సుగ్రీవ నారసింహుఁడు చ. పగలూ రాతిరీఁ గాని పటు సంధ్యా కాలమందు మొగిఁ బచ్చీ వెచ్బీగాని మొనగోళ్ళచే గగనమూ నేలాఁ గాని గనమైన తొడమీఁద నగుతా హిరణ్యుఁ గొట్టె నరసింహ దేవుఁడు చ. వెలుపలా లోనాఁ గాని వెడఁగుగడపమీఁద తలి తండ్రి గాని యట్టి తావునఁ బుట్టి మొలచి చిగిరించని ముదురుఁగోరలతోడ నలి హిరణ్యు జంకించె నరసింహ దేవుఁడు చ. మానిసీ మెకమూఁగాని మంచి యూకారముతోడ పూని యిలూఁ బందిలీఁ గాని గుహలో ఆనుక హిరణ్యుని నడఁచీ శ్రీ వేంకటాద్రి నానా దిక్కుల నేలిన నరసింహ దేవుఁడు రేకు:0117-01 రామక్రియ సంపుటము: 02-097 పల్లవి: ఇట్టిజీవుల కింక నేది వాటి దట్టమై దేవుఁడ నీవే దయఁజూతుగాకా చ. తనజన్మవిదు(ధు)లనుఁ దలఁచు నొక్కొకవేళ వొనర మఱచునట్టె వొక్కొకవేళ వినుఁ బురాణకథలు వివరించి యొకవేళ పెనచి సందేహములె పెంచు నొకవేళ చ. విసిగి సంసారమందు విరతుఁడౌ నొకవేళ వొ(సగి యందె మత్తుఁడౌ నొకవేళ పసిగొని యింద్రియాల బంటై వుండు నొకవేళ ముసిపితో దైవానకు మొక్కు నొక్కవేళ చ. కోరి తపములు చేసి గుణియా తా నొకవేళ వూరకే అలసి వుండు నొక్కవేళ యిూరీతి శ్రీవేంకటేశ యెదలో నీవుండఁగాను జీరాన నీకే మొఱవెట్టు నొకవేళ రేకు: 0363–04 సామంతం సంపుటము: 04-372 పల్లవి: ఇట్టిదివో హరికృప యెంచినను గట్టిగా నాహరి కృపే కలదువో మాకు చ. బలుహిరణ్యాక్షుఁడు ప్రహ్లాదునిబట్టి జలధి వేసిన నీరుచట్టె తేలె కలుషించి కమ్మరాను కడునగ్నిఁ దోసిన నిలువెల్లఁ జల్లనినీరై తొలఁకె