పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/227

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

225 చ. సతమై చక్రాంకితుల చరితే బ్రాహ్మణ్యము పతి శరణాగతియే బ్రాహ్మణ్యము వెతలేని వీరలసాత్వికమే బ్రాహ్మణ్యము తతి ద్వయాధికారులే తప్పరు బ్రాహ్మణ్యము చ. అంచఁ బరమభాగవతాధీనము బ్రాహ్మణ్యము పంచంసంస్కారాదులదే బ్రాహ్మణ్యము యెంచఁగ శ్రీవేంకటేశుఁ డితఁడేఁ బ్రాహ్మణ్యుఁడు ముంచి యీతనివారౌటే మొదలి బ్రాహ్మణ్యము రేకు: 9030-01 దేవగాంధారి సంపుటము: 04-551 పల్లవి: ఇట్టి ముద్దులాఁడి బాలుఁడేడ వాఁడు - వాని బట్టి తెచ్చి పొట్టనిండఁ బాలువోయరే చ. గామిడై పారితెంచి కాఁగెడి వెన్నలలోన చేమ పూవు కడియాల చేయిపెట్టి చీమ గుట్టెనని తన చెక్కిటఁగన్నీరు జార వేమరు వాపోయే వాని వెడు వెట్టరే చ. ముచ్చువలె వచ్చి తన ముంగమురువుల చేయి తచ్చెడి పెరుగులోన తగఁ బెట్టి నొచ్చెనని చేయిదీసి నోరనెల్ల జొల్లుగార వొచ్చెలి వాపోవువాని నూరడించరే చ. ఎప్పుడు వచ్చెనో మాయిలుచొచ్చి పెట్టెలోని చెప్పరాని వుంగరాల చేయిపెట్టి అప్పఁడైన వేంకటాద్రి అసవాలకుఁడు గాన తప్పకుండఁబెట్టె వాని తలకెత్తరే రేకు:0233–04 బౌళి సంపుటము: 03-189 పల్లవి: ఇట్టి యవివేకబుద్ధి యే పనికి వచ్చునిఁక జట్టిగొని నాగుణము చక్కఁజేయఁ గదవే చ. హరి నీయిచ్చఁ బ్రపంచమంతా నీవు నడపఁగ అరసి నీశక్తి దెలియక నమ్మక వెర వెరఁగనియట్టి వెట్టివాఁడనే నొక్కదొరనంటాఁ బనుల కుద్యోగించేను చ. అంతరాత్మవై నీవు అన్నియుఁ బెర రేఁచఁగ బంతినే నీ మహిమెల్లా భావించక చెంత నీసంసారము సేసేవాఁడ నే నంటా దొంతుల కోరికలతోఁ దూరిపారేను చ. ఆదినుండి స్వతంత్రుఁడవై యేలినట్టి నిన్ను సాదించి శరణు నాఁడే చొరఁగలేక యీదెస శ్రీవేంకటేశ యిప్పుడు నీదాఁసుడనై నీ దయ కలిమితోడ నేఁడు మొక్కేను రేకు: 9042-01 ఆహిరి సంపుటము: 04-557 పల్లవి: ఇట్టి సంసారికేదియు లేదాఁయ తట్టువడుటేకాని దరిచేరలేదు చ. ములిగి భారపుమోపు మోఁచేటివాఁడు అలసి దించుకొను నాడాడను అలరు సంసారికి నదియు లేదాయ తొలఁగని భారమెందును దించలేదు