పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/226

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

224 చ. నెమ్మదిఁ బ్రజలనెల్లా నీవే పుట్టించఁగాను కమ్మి నేనే బిడ్డలఁ గంటినంటా సంతసింతును సమ్మతి నీవే సర్వసంపదలు నొసంగఁగాను యిమ్ముల గడించుకొంటి నివి నేనంటా నెంతు చ. మన్నించి యిహపరాలు మరి నీవే యియ్యఁగాను యెన్నుకొందు నాతపాశీమహిమ యిది యనుచును వున్నతి శ్రీవేంకటేశ నన్ను నేమి చూచేవు అన్నిటా నాయాచార్యు విన్నపమే వినవే రేకు:0206-03 గుండక్రియ సంపుటము: 03-033 పల్లవి: ఇట్టి నాస్తికుల మాట యేమని నమ్మెడి దిఁక పట్టి సములమంటానే భక్తుల దూషింతురు చ. వేదములు చదువుతా విశ్వమెల్లాఁ గల్లనేరు ఆ దెస తాము పుట్టుండి అదియును మాయనేరు పాదగు విష్ణుడుండఁగ బయలు తత్త్యమనేరు లేదు జీవత్వమంటా లేమలఁ బొందుదురు చ. తిరమై తమఇండ్ల దేవపూజలు సేసేరు ధరలోన తముఁ దామే దైవమనేరు అరయం గర్మమె బ్రహ్మమని యాచరించేరు సరి నదే కాదని సన్యసించేరు చ. అందుక పురుషసూక్త మర్ధముఁ జెప్పదురు కందువ నప్పటి నిరాకార మందురు యిందులో శ్రీవేంకటేశ యిటె నీ దాసులుఁ గాక మందపు రాక్షసులాడే మతము నడతురు రేకు:0201-01 మాళవి సంపుటము: 03-001 పల్లవి: ఇట్టి ప్రతాపము గల యీతని దాసుల నెల్ల కట్టునా కర్మములెల్ల గాలిఁ బోవుఁ గాక చ. యెలమిఁ జక్రాయుధున కెదురా దానవులు తొలఁగ కెందుచొచ్చినఁ దుండించుఁ గాక ఇల గరుడధ్వజు పై నెక్కునా విషములు కలఁగి నీరై పారి గాలిఁ బోవుఁ గాక చ. గోవర్ధనధరునిపై కొలుపునా మాయలు వేవేలు దునుకలై విరుగుఁగాక కేవలుఁ డచ్యుతునొద్దఁ గీడు చూపఁగలవా కావరమై తాఁ దానె గాలిఁ బోవుఁ గాక చ. వీరనారసింహునకు వెరపులు గలవా దూరాన గగులకాడై తొలఁగుఁ గాక కోరి యూ శ్రీవేంకటేశుఁ గొలిచిత్రి మిదివో కారుకొన్న పగలెల్ల గాలిఁ బోవుఁ గాక రేకు:0195-01 పాడి సంపుటము: 02-486 పల్లవి: ఇట్టి బ్రాహ్మణ్య మెక్కుడు యిన్నిటిలోన దట్టమై తదియ్యులకె తగును బ్రాహ్మణ్యము చ. హరిఁ గొలిచేవారి కమరు బ్రాహ్మణ్యము పరమవైష్ణవమే పో బ్రాహ్మణ్యము హరిణోర్ధ్వపుండ్రదేహులౌటే బ్రాహ్మణ్యము తిరుమంత్రవిధులదే తేఁకువ బ్రాహ్మణ్యము