పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/225

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

223 చ. యెఱుకతో మదించితి యిట్టే నీదాస్యమున మఱి నిన్నొల్లని చదువు మచ్చరించితి తఱిఁ జలపట్టితి నీతప్పని భక్తియందు వెఱవక నిన్నొల్లని విధుల నిందించితి చ. కల కర్మములెల్లా నీకైంకర్యములందు వెట్టితి బలు మమకారము నీపైఁ జేర్చితిఁ యొలిమి శ్రీవేంకటేశ యిన్నిటా నన్నేలితివి నిలిచిన కాలమెల్లా నీసేవే చేసితి రేకు: 9022-03 లలిత సంపుటము: 04-542 పల్లవి: ఇటువలెనె పో యింకా మాకు వటపత్రశాయి మమ్ము వదలీనా చ. యన్నఁడు దెల్లవారెనో యాడఁ బొద్దు పొడచెనో యన్నట్లనుండితి మహర్నిశము యన్నిటాఁ గడమలేక యొక్కడ నెదురులేక పన్నగశయనుని కృపనేకాదా చ. ఏడ వోవువ్యాధులెటు వచ్చి నిలిచెనో కూడిన యాలరులెల్ల కొండలవలె నీడలే నిలువులెల్ల నెలవులై యున్నచోట యీడులేనివివి హరి యీవులేకావా చ. ఎవ్వరిచేత దాఁచితిమెచ్చట నిధానములు ఇవ్వలా మాతలఁచిన యిన్నియు నబ్బె రవ్వగు వెంకటగిరిరాయఁడు మాతలఁపులో పువ్వక కాచి పండిన భోగమేకాదా రేకు:0050-03 బౌళి సంపుటము: 01-306 పల్లవి: ఇటువలెనేపో సకలము యించుకగన భావించిన అటమటములసంతోషము ఆసలు సేయుటలు చ. పగగొనితిరిగేటిజన్మపు బాధలు తనకే కాలము తగుసుఖ మెక్కడ నున్నది తడతాఁకులే కాక పొగలోపల సేక గాసిన భగభగఁ గన్నుల నీళ్లు నిడిగినదు:ఖమే కాకిటు నిజసౌఖ్యము గలదా చ. పొలసిన మాయపురూపులు పొలఁతుల మచ్చికమాటలు తలఁచిన తనకేమున్నది తలఁపోఁతలేకాక బలువునఁ బారఁగ మోహవుపాశము తన మెడఁ దగిలిన తలకిందుగఁ బడుటెల్లను తనకిది ప్రియమనౌనా చ. చేతిపదార్థము దలఁచక చేరువనుండినవారల చేతిపదార్థము గోరిన చేతికి లోనౌనా ఆతుమఁగల వేంకటపతి నాత్మఁ దలఁచి సుఖింపక యేతరి సుఖములఁ దిరిగిన నింపులు దనకెనా రేకు:0163-05 ముఖారి సంపుటము: 02–304 పల్లవి: ఇట్టి నా వెట్టితనము లేమని చెప్పుకొందును నెట్టన నిందుకు నగి నీవే దయఁజూడవే చ. పాటించి నాలో నుండి పలికింతువు నీవు మాటలాడ నేరుతునంటా మరి నే నహంకరింతును నీటున లోకములెల్లా నీవే యేలుచుండఁగాను గాఁటాన దొరనంటా గర్వింతు నేను