పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/224

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

222 చ. సనాతనబహువేదశాస్త్రంబులు మిమ్ముఁ నుతింపలేవు అనంతయజ్ఞంబులు మిమ్ము నటు సాధించఁగలేవు తనూధరు లెంతటివారు దామోదర నీవే అహల్యను వినోదముగఁ గాచినయటువలె వెసఁ గాత్రువు గాక చ. రమాసతి నీళామహిరామలు మీతలఁ పెఱంగరు సమేతులైన శేషాదులు మీజాడ మీరలేరు తమోమయు లిందరును ధరణిధర శ్రీవేంకటేశ నమోనమో యని మొక్కంగాఁ ననుఁగాతువు గాక పె.అ.రేకు:0018-05 గుజ్జరి సంపుటము: 15-103 పల్లవి: ఇటువంటి దురుణి నన్నెట్టు గాచితవో గాని సటలాడేవానికి సత్య మెందు లేదు చ. మదనాతురునికిని మరి వివేకము లేదు కదిసి అలసునికి కర్మము లేదు పొదిగి యా శకునిఁకే పుణ్యపాపము లేదు మొదలనె మూర్శనకు మొగ మోఁట లేదు చ. కొంచెపు నాస్తికునికి గురుఁడు దైవము లేఁడు పారించిన లోవానికి భోగమే లేదు యించుకంత దరిద్రున కియ్యా గొన శక్తి లేదు చంచల చిత్తునికి నిశ్చయ మెందు లేదు చ. మత్తుఁడైనవానికి మరి పనులే లేవు హత్తి వేంటకానికి దయలు లేవు సత్తుగ శ్రీ వేంకటేశ శరణాగతుఁడ నీకు యిత్తలఁ దాల్లిటి చీంత లిఁక నేమి లేవు పె.అ.రేకు : 0066-03 బౌళి సంపుటము: 15-378 పల్లవి: ఇటువంటివారల నెట్టు బోధించఁగ వచ్చు కుటిలపు బుదులచే కుOదుదురు తాము చ. పాపపుణ్యకర్మదేహి పసిరికాయపురువు కూపములోనికప్పదురుణబదుఁడు దీపము వేఁటమృగము తెగని యాసోదకాఁడు దూపము కాకి భక్తి యెందును లేని వాఁడు చ. మతిచంచలపువాఁడు మద్దెలలోని యెలుక ప్రతియై కోరెడువాఁడు వలలో మీను కుతిలపు టహంకారి గుండెమీఁది చింబోతు అతికాముకుఁడు జిగురంటుకొన్న పికిలి చ. దేవతాంతరపరుఁడు తేనెలోఁ బడిన యీఁగ భావించి కావనివాఁడు బెసి కొక్కెర శ్రీవేంకటాధీశ్వరు సేవించక మోక్షానకుఁ బోవల ననేటివాఁడు బూరగుపై చిలుకా రేకు:0147-05 రామక్రియ సంపుటము: 02-215 పల్లవి: ఇటువంటివెల్లా నీకే యిట్టే సెలవు వేసితి తటుకన నీవనే నిధానము చేకొంటివి చ. కామించితి నాత్మ నిన్నుఁ గలసి భోగించుటకు వేమరుఁ గ్రోధించితి నీవిరోధులపై నేమమున లోభించితి నీమంత్రమన్యుల కియ్య ఆముకొని మోహించితి హరి నీరూపునకు