పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/223

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

221 గగనము జగములు గడగడ వడ(కె చ. బిరుసుగ గరుడని పేరెము దోలుచు బెరసి నీవు కోపించినను సరుస నఖిలములు జర్ణరితములై తిరుపున నలుగడ దిరదిరం దిరిగె చ. పల్లించిన నీ పసిఁడి గరుడనిని కెల్లున నీ వెక్కినయపుడు రుల్లనె రాక్షస సమితి నీ మహిమ వెల్లి మునుఁగుదురు వేంకటరమణా రేకు: 0163-06 ముఖారి సంపుటము: 02-305 పల్లవి: ఇటు నిను దెలియఁగ ఎంతటివారము త్రటుకున నాసలఁ దగులుట గాక చ. నానామూర్తులు నగధర నీరూపు యే నెలవుల నిన్నెటువలెఁ దలఁచుట పూని నీ భావము పొందుగాఁ జెప్పఁగా వీనులు చల్లఁగా వినుటే కాక చ. పెక్కు నామములు బిరుదు లనంతము లెక్కడ గొలదిగ నెన్నెని పొగడుట యిక్కువ సేసుక యిందులో నొకటి పక్కన నొకమరి పలుకుట గాక చ. వేవేలు గలవు నీ విహార భూములు యేవిధమున నెందెందని తిరుగుట శ్రీవేంకటేశా నీ శృంగారమెల్లను సేవించి ముదమునఁ జెలఁగుట గాక రేకు:0081-04 గుజ్జరి సంపుటము:01-391 పల్లవి: ఇటుగన సకలోపాయము లుడిగిన యీశ్వరుఁడే రక్షకుఁడు తటుకున స్వతంత్రముడిగిన యాత్మకు తగునిశ్చింతమే పరసుఖము చ. ఆఁకటి కడుగని శిశువుకుఁ దల్లి యడిచి పాలు ద్రాగించినరీతి, యీకడఁగోరికలుడిగిన యోగికి నీశ్వరుఁడే రక్షకుఁడు చేకొని బుద్దెఱిఁగిన బిడ్డలపైఁ జింతింపరు తొల్లిటివలెఁ దల్లులు యీకొలఁదులనే స్వయత్న దేహుల కీశ్వరుఁడును వాత్సల్యము వదలు చ. తతిఁ గరిరాజుఁ గాచినయట్లు ద్రౌపదిమానము గాచినయట్లు, హితమతి స్వతంత్రముడిగిన యోగికి యీశ్వరుఁడే రక్షకుఁడు అతనుఁడు భస్మంబయ్యిననాఁడు అజునిశిరంబటు ద్రుంచిననాఁడు చతురుఁడుదా నడ్డము రాఁడాయను స్వతంత్రముడు గని జీవులు గాన చ. దిక్కని యనిశముఁ జిత్తములోనఁ జింతించేటి శరణాగత జనులకు, యిక్కడనక్కడ శ్రీ వేంకటగిరియినాశ్వరుఁడే రక్షకుఁడు మక్కువతోఁ దనయంతర్యామిని మఱచినస్వామి ద్రోహులకెల్లా అక్కరతోఁ బుట్టుగులే భోగ్యం బహంకారము విడువరుగాన రేకు:0162-01 గౌళ సంపుటము:02-297 పల్లవి: ఇటులైతేఁ బుణ్యము నీకు యిది వుపకారంబౌను తటుకన నీకీరితి వొగడుదురు తలకొని యిందరును చ. సురాసురగంధర్వయక్షులు మిమ్ముఁ దెలియఁగలేరు పరాశరాదులు మీరూపు భావించఁగలేరు నరు లెరుఁగుదురా మిమ్ము నారాయణ నీవే సులభండవై కరీంద్రుఁ గాచినయటువలెఁ గాతువు గాక