పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/222

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

220 నారాయణ నామమిదే నమ్మినట్టి ధనము చ. పరమపదవికి సంబళ మైన ధనము యిరవై భక్తులకెల్లా నింటి ధనము పరగ నంతరంగాన పాఁతినట్టి ధనము హరినామ మిదియ పాశీ అరచేతి ధనము చ. పాంచి శివుఁడు కాశిలో బోధించే ధనము ముంచిన ఆచార్యుల మూలధనము పంచి శ్రీవేంకటపతి పాలించే ధనము నించి విష్ణునామ మదే నిత్యమైన ధనము పె.అ.రేకు:0003-02 లలిత సంపుటము: 15-015 పల్లవి: ఇచ్చితివి తొల్లే నాకు యియ్యఁగల వన్నియును మచ్చిక నీ శరణన్న మాత్రమే చాలూ చ. సామీప్యము నడుగ సారూప్యము నడుగ కామించి సాయుజ్యసాలోక్యము లడుగ భూమిఁ గాని పాత్రాళంబునఁ గాని దివిఁ గాని సామాన నీదాసులతో సహవాస మియ్యవే చ. కాయసిద్ది నడుగ కర్మఫల మడుగ ఆయడ దేవ పట్టము లవి యడుగ యీయడ నేఁడే కాని యింకొక్కనాఁడైనాఁగాని చేయూర నీ దాసుల సేవ నాకు నియ్యవే చ. దేవుఁడవు నీవే మాకుఁ దెలిపె యాచార్యులు శ్రీవైష్ణవులే గతి చిక్కినవేళ శ్రీ వేంకటేశ్వర జీవము బారము నీది పావన మైతి మింక పలు చింత లేల రేకు: 0196-02 సాళంగనాట సంపుటము:02-493 పల్లవి: ఇచ్చినవాఁడు హరి పుచ్చుకొన్నవాఁడ నేను చెచ్చెరఁ దగవు లింకఁ జెప్పఁగదరో చ. నిలిచినది జగము నిండినది భోగము కలిగె జీవుల కొక్కకాణాచి వలయశాసనాలు వడి నాలు వేదములు చలపట్టి జాణలు చదువుకోరో చ. పారినవి మనసులు పట్టినది జననము పాశీరు దీరెఁ గర్మముల పొలమేర కోరికలె సాక్షులు గుట్టలు త్రిగుణములు వూరుఁ బేరుఁ దెలుసుక వొడఁబడరో చ. దక్కినది ధర్మము తప్పనిది భాగ్యము లెక్కించ నుదుటివ్రాలె లిఖితములు యిక్కువ శ్రీవేంకటేశుఁ డిన్నిటికి మూలము చిక్కులు వాపె నితని సేవించరో రేకు:0015-04 నాట సంపుటము: 01-092 పల్లవి: ఇటు గరుడని నీవెక్కినను పటపట దిక్కులు బగ్గనఁ బగిలె చ. ఎగసిన గరుడని యేపున ధా' యని జిగిద్°లఁక చబుకు చేసినను నిగమూOతOబులు నిగమ సంఘములు