పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/219

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

217 దురితవర్తనునకు దుర్గతియె యందురు చ. అతినిషన్డారభాషికి నన్యకాంతాలోలునకు యితరాసూయపరున కిహమే లేదని యందురు పతితుం డైనవానికి బ్రహ్మణనిందకునకును తతి ననాచారికిని దైవము లేఁడని యందురు చ. అనృతవాదికిని అర్థచోరకునకు ఘనహింసకునకు లోకము లేదని యందురు విని నే నిందులకుఁగా వెఱచి నీకు శరణంటిని వెనక వేసుకొని శ్రీవేంకటేశ యేలవే రేకు: 0101-06 ఆహిరి సంపుటము: 02-006 పల్లవి: ఇందులో మొదలికర్త యెవ్వఁడు లేఁడు గాఁబోలు ముందు కరివరదుఁడే ముఖ్యుఁడు గాఁబోలు చ. ఆడితిఁబో బహురూపా లన్నియోనులఁ బుట్టి తోడనె బ్రహ్మాదులనే దొరలెదుటా జాడలు మెచ్చాలేరు చాలునన్నవారులేరు వేడుక నడవి(గాసే వెన్నెలాయ బ్రదుకు చ. అన్నికర్మములుఁ జేసి ఆటలో బ్రాహ్మణుఁడనైతిఁ నన్ని వేదములనేటి యంగడివీధి నన్నుఁ జూచేవారు లేరు నవ్వేటివారు లేరు వన్నెలసముద్రములో వానలాయ బ్రదుకు చ. సంసారపునాటకసాలలో ప్రతిమనైతి కంసారి శ్రీవేంకటపతి మాయలోన యింస లిన్నియుఁ దేరె నిందరుఁ జట్టములైరి హంసచేతి పాలునీరునట్లాయ బ్రదుకు రేకు: 0300-04 పాడి సంపుటము: 03-581 పల్లవి: ఇందులోన నే నెవ్వరిఁబోలుదు అంది నీవాఁడ నేననుకొంటిఁ జుమ్మీ చ. జలజనాభ నీ శరణనువారలు అల నారదసనకాదులు కెలన మరియు నీ కింకరవర్తులు తెలిసిన బ్రహ్మాదిదేవతలు చ. నోరార హరి నిను నుతించువారలు చేరువ నుండేటి శేషాదులు ధారుణిలో నీదాసాన(ను?)దాసులు మారుతిముఖ్యులు మహామహులు చ. బడి నీచే ముక్తి వడసినవారలు సుడిగొను మునిజన శుకాదులు కడఁగిన శ్రీవేంకటపతి నీవే తడవి నన్ను దయదలఁచుమీ రేకు:0315-04 ముఖారి సంపుటము: 04–087 పల్లవి: ఇందులోనఁగల సుఖమింతే చాలు మాకు నిందు వెలియైన సిరులేమియు నొల్లము చ. ఆదిదేవు నచ్యుతు సర్వాంతరాత్మకుని వేదవేద్యుఁ గమలాక్షు విశ్వపూరుని శ్రీదేవు హరి నాశ్రిత పారిజాతుని