పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/218

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

216 దిందుపడ (?) నొరులు తెలిపెడిదేది చ. వొకచేత హేయ ముడుగక కడుగును వొకచేత భుజించు నొగి రుచులు అకటా దృష్టం బరచేనుండఁగ సకలము నుపదేశము లిఁక నేవి చ. మలయు భోగములు మాయలని యెరుఁగు నిలిచిన మోక్షపు నిజ మెరుఁగు యిలపై శ్రీవేంకటేశుఁడు గలఁడిదె బలిమి గలిగెనిఁకఁ బదరెడిదేది చి.ఆ.రేకు:0007-04 ఆహిరినాటసంపుటము: 10-040 పల్లవి: ఇందురు నేల దూరేరు హితవే నీవు సేయఁగా ముందు ముందె తమ్ముఁ గర్మములు సేయు మంటివా చ. తెలిసి నిన్నుఁ గొలువ దేహ మిచ్చితివి గాక బలిమినె మాయలలోఁ బడు మంటివా మలసి నిన్నుఁ దలఁచ మన సిచ్చితివి గాక కొలగట్టి విషయాలఁ గోరు మంటివా చ. నగుతా నిన్నుఁబొగడ నాలు కిచ్చితివి గాక అగడుగా నూరమూఁట లాడు మంటివా సాగసి నిన్నుఁ జూడఁగాఁ జూప లిచ్చితివి గాక వగవగలతో నూరివారిఁ జూడు మంటివా చ. శ్రీవెంకటనాథ నిన్నుఁ జేరు మనంటివి గాక జీవులను మనుజులాఁ జేరు మంటివా భావించి నీదాసులనె భజించు మంటివి గాక దావతి లంపటాలలోఁ దడఁబడు మంటివా పె.అ.రేకు: 0037-01 దేవగాంధారి సంపుటము: 15-207 పల్లవి: ఇందులో నే నెవ్వఁడను యెంచి నిన్నుఁబొగడఁగ కOదువ యుOత్రంత్రని కానరాదు మహిమ చ. యేచి నీ రోమరంధ్రాల నిటువంటి బ్రహ్మాండకోట్లు కాచినట్లున్నవి నీ కాయమునందు వూచిన నీ బొడ్డుఁదమ్మి బుట్టిన బహ్మ లెందరో చేచేత రుద్రు లెందరో చెప్పరాదు మహిమ చ. నారువోసినట్లాను నానాదేవకోట్లు కారుకమ్మీ నిదెనీ సంకల్పమునందు యీరీతి మును లెందరో యిక వేదరాసు లెన్నో చేరన జీవులెందరో చెప్పరాదు మహిమ చ. అనలులుఁ జంద్రులు నాదిత్యకోట్లు జనియింపుచున్నవి నీ జలజాక్షుల యెనయి శ్రీ వేంకటేశ యిన్నిటా నీ దాసుఁడను చెనక నలవి గాదు చెప్పరాదు మహిమ పె.అ.రేకు:0060-01 నాట సంపుటము: 15-340 పల్లవి: ఇందులో నే నెవ్వఁడనో యేమేమి సేసితినో ముందు వెనుక లెఱుఁగ మురహర కావవే చ. పరదూషకునకు పరమనాస్తికునకు కరుణ లేనివానికి గతి లేదని యందురు సరవిఁ గ్రూరునకు సంశయచిత్తునకు