పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/220

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

218 అదిగొని శరణంటి మన్యము నేమొల్లము చ. పరమాత్ముఁ బరిపూరు భవరోగవైద్యుని మురహరు గోవిందు ముకుందుని హరిఁ బుండరీకాక్షు ననంతు నభవుని పరగ నుతించితిమి పరుల నేమొల్లము చ. అనుపమ గుణదేహు నణురేణు పరిపూరు ఘనుఁ జిOరOత్రనుని కలిభOజను దనుజాంతకుని సర్వధరు శ్రీవేంకటపతిఁ గని కొలిచితిమి యేగతులు నేమొల్లము రేకు: 0348-02 మేఘరంజి సంపుటము: 04-280 పల్లవి: ఇందులోనే కానవచ్చె నిన్నిటా నీ మహిమలు చెంది నీవే దిక్కు మాకు సీతాపతిరామా చ. దేవ నీకు వలసితే తృణము బ్రహ్మాస్త్రమాయ భావించితే రాతికిఁ బ్రాణము వచ్చె కావలసి యేసితే నాకాశముకట్లు దెగె దైవమవంటే నీవే దశరథరామా చ. కూరుచుక యేలితేను కోఁతులు రాజ్యము సేసె కోరితేనే నీటిపైఁ గొండలు దేలె సారెఁ గదలివచ్చె నీ సన్నల సంజీవికొండ యేరీతి నీసరి వేరీ యినకులరామా చ. సూటి నీవు దలఁచితే సురలు పంపు సేసిరి చాటితేనే నీపేరు జపమాయను ఆటల నీకతలెల్లా నాచంద్రార్కమై నిలిచె గాటపు సిరుల శ్రీవేంకటగిరిరామా రేకు:0096-01 నాట సంపుటము: 01-477 పల్లవి: ఇందులోనే కానవద్దా యితఁడు దైవమని విందువలె నొంటిమెట్ట వీరరఘురాముని చ. యెందు చొచ్చె బ్రహ్మవర మిల రావణుతలలు కందువ రాఘవుఁడు ఖండించునాఁడు ముందట జలధి యేమూల చొచ్చెఁ గొండలచే గొందింబడఁగట్టివేసి కోపగించేనాడు చ. యేడనుండె మహిమలు యిందరి కితఁడు వచ్చి వేడుకతో హరివిల్లు విఱిచేనాఁడు వోడక యింద్రాదు లెందు నొదిగి రీతనిబంటు కూడ బట్టి సంజీవికొండ దెచ్చేనాఁడు చ. జముఁ డెక్కడికిఁ బోయ సరయువులో మోక్ష మమర జీవుల కిచ్చెనల్లనాఁడు తెమలి వానరులై యీదేవతలే బంట్లేరి తిమిరి శ్రీవేంకటపతికి నేఁడు నాఁడు రేకు:0156-06 ముఖారి సంపుటము: 02–268 పల్లవి: ఇందువల్ల నేమిగదు యినుపగుగ్గిళ్లింతే యిందిరారమణు సేవే యిరవైన పదవి చ. సతులతో నవ్వులు చందమామగుటుకలు మతితలపోఁత లెండమావులనీళ్ళు రతులతో మాటలు రావిమానిపువ్వులు