పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/215

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

213 వలెనే పాశీఁగలవెల్ల వడిఁ దానే పావురే చ. నిండిన యద్దములోన నీడ వొడచూపినట్టు దండియైన పుట్టుగులు తన్నుఁ దానే వచ్చురే పండిన పండ్లు తొడమ(బాసి వూడినయట్టు అండనే మరణములు అందరికి సరిరే చ. పెనురాతిపై గడవ పెట్టగాఁ గుదురై నట్టు తను(దానే చింతింపఁ దలఁపు నిలుచురే ఘనుఁడు శ్రీవేంకటేశుఁ గని శరణన్నఁ జాలు వెనక పాపాలు మంచు విచ్చినట్టు విచ్చురే రేకు: 0363-03 వళవశ్రీ సంపుటము: 04-371 పల్లవి: ఇందుకుఁగా నా యెరఁగమి నేమని దూరుదును అందియు నిను నేఁదెలియక అయ్యో నేనిపుడు చ. ఆతుములోననుండి యఖిలోపాయములు చేతనునకు నీవే చింతించఁగాను కాతురపడి నేను కర్తననుచుఁ బనులు యీతలఁ జెప్పఁగఁబూనే నిస్సిరో చ. తను విటు నీ వొసఁగి తగు భాగ్యము నీవై అనువుగ జీవుని నీయటు నీవేలఁగను తనియక నే వొరులు దాతలనుచుఁ బోయి కనుఁగొని వేడఁగఁ దొడఁగేఁ గటకటా చ. శ్రీవేంకటాద్రిపై నుండి చేరి కన్ను లెదుటను సేవగొని యిట్టే కృపసేయఁగాను సోవలఁ గన్నవారెల్లాఁ జుట్టములంటా నేను జీవులతోఁ బొందుసేసేఁ జెల్లఁబో రేకు:0234-04 బౌళి సంపుటము: 03-195 పల్లవి: ఇందుకే కాలమందే యీతని శరణంటిమి ముందుముందే దయఁజూచి మొగిఁ గాచుఁగాక చ. పుడమి గుంగిన నెత్తె పురుషోత్తముఁ డితఁడు యెడసి కొండ గుంగితే నెత్తె నితఁడు అడరి సంసారవార్ధి నడఁగిన దాసులను యిడుములఁ బొందకుండా యెత్తి కాచుఁగాక చ. పట్టి ప్రహ్లాదు బాధలు పాపిన దేవుం డితఁడు రెట్టిగా వేదము లుద్ధరించె నితఁడు వట్టి దుషులలో సహవాసమైతే దాసులను దిట్టయై వెళ్లఁదీసి తా దిక్కె కాచుఁగాక చ. లంకలో సీతఁ దెచ్చిన లావరి తానే యితఁడు మంకు అహల్యశాపము మాన్పె నితఁడు అంకెల శ్రీవేంకటేశుఁడతిభీతిఁ బాపి మమ్ము గొంకక తన దాసులఁ గూడి కాచుఁగాక రేకు: 0326-03 దేశాక్షి సంపుటము:04-150 పల్లవి: ఇందుకేది వుపాయ మోయినాశ్వర నీకే తెలుసు మందలించ నశక్తుఁడ మరి నీదాసుఁడను చ. ధీరుఁడనై ధరలోన దేహము నే మోచితి కోరి పుణ్యపాపాలకు గురియు నైతి వూరట యేమిటా లేదు వోపనని మానరాదు