పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/214

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

212 బడిఁ బుణ్యపాపాలపై తరవు బదుకు చ. నాలుక గడచితేను నరకపు బదుకు మూలమలమూత్రాల మూటగట్టే బదుకు కాలము నడిసి వూర్పుగాలి(బుచ్చే బదుకు పాలుమాలే యింద్రియాల పంగెమాయె బదుకు చ. ఇంపు సుఖదుఃఖాల యెండనీడ బదుకు ముంపుఁ గామక్రోధాలమాటు బదుకు జంపుల శ్రీవేంకటేశుశరణు చొరఁగ నేఁడు సాగింపు లిన్నిటా నాకు సుఖమాయ బదుకు రేకు: 0370-01 దేవగాంధారి సంపుటము:04-410 పల్లవి: ఇందుకు ధ్రువాదు లిటు సాక్షి చెంది నమ్మవో జీవుఁడ నీవు చ. కొండలవంటివి ఘనోరపాపములు ఖండించును హరి ఘన నామ జపము నిండించును మతి నిత్యానందము పండించునపుడె పరమపదంబు చ. జలధులవంటివి జననబంధములు తొలఁగించును హరితూరిన భక్తిది వెలిఁగించును ఘన విజ్ఞానంబులు చెలఁగించును బహు సిరిసంపదలు చ. తోవరాని బహుదుఃఖము లణఁచును శ్రీ వేంకటపతిఁ జేరిన శరణము పావనOబుగాఁ బచలించు గుణము కైవశమగు లోకములెల్లాను రేకు: 0359-02 ముఖారి సంపుటము:04-346 పల్లవి: ఇందుకు విరహితములిన్నయు సజ్ఞానమని చందమున గీతలందుఁ జాటీనిదివో చ. మూనావమూనములు మూని డOబు విడుచుట పూని హింసకుఁ జొరక యోరుపు గలుగుటయు ఆని మతిఁ గరఁగుట యాచార్యోపాసన తానెప్పుడు శుచియాట తప్పని విజ్ఞానము చ. అంచల సుస్థిరబుద్ధి యాత్మవినిగ్రహము అం:చిత్రవిప్నయనిరహంకారాలు ముంచినజన్మదుఃఖములు దలపాశీయుట కంచపుసంసారము గడుచుటే జ్ఞానము చ. అరిమిత్రసమబుద్ధి యనన్యభక్తియు సరినేకాంతమును సజ్జనసంగ విముక్తి ధర నధ్యాత్మజ్ఞానతత్వము దెలియుట గరిమలందుట శ్రీవేంకటపతి జ్ఞానము రేకు:0134-04 మాళవి సంపుటము: 02-140 పల్లవి: ఇందుకుఁ జింతించనేల యీశ్వరుని మాయ లివి యెందుకు మూలము హరి యీతనిఁ జింతించరే చ. అల నారికడపుఁ గాయకు నీరు వచ్చినయట్టు తలఁచి రాఁగల మేలు తన్నుఁ దానే వచ్చురే లలి నేనుగుదిన్న వెలఁగపంటి బేసము