పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/213

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

211 చక్కగా నిందునే ముక్తి సాధించవలయు చ. మెఱసి బాల్యమునందు మిక్కిలి బుద్ధి వుట్టదు మఱి వార్థకమైతేను మందబుద్ధితో నుండు తఱిఁ బ్రౌఢవయసున తగు వివేకము పుట్టు నెఱి నిండేసుజ్ఞానము నిశ్చయింపవలయు చ. కాంతల భ్రమ బడితే కడు మత్తుఁడై యుండు అంత ధనకాంక్షలైతే నలమట నలసు సంతతవిరక్తియైతే సర్వార్థములుఁ జేరు యెంతైనా యిందే శ్రీవేంకటేశుఁ గొల్వవలయు పె.అ.రేకు: 0033-04 పాడి సంపుటము: 15-187 పల్లవి: ఇందుఁగల పస యెల్ల యింతే నుండీ బొందితోనే హరిఁ గొల్పి పొడ వెక్కరో చ. లోపలికి వెలికిని లోఁగి యెడ త్రాఁకేటి పూపెల ముక్కుకన వుసు రింతే తనవు రూపులేని ప్రాయపు రుచి చిక్కి బ్రతికేటి పైపూత వయసునఁ బచ్చియెన తనువు చ. నిచ్చలు మాపు రేపు నిదిరించి మేలుకొంటి దిచ్చరి చావుఁ ಬುಲಿಟ್ಟು తెలిపె తనువు తచ్చి మలమూత్రముల దాఁ పరపు పుట్టినిట్లు ఆచ్చపు హేయములచే అంటరానితనువు చ. తుంచి సగ మటు వొంగ తోడనే లోనికి వచ్చు పంచి లోనికి వెలికీ ప్రాణ మొక్కటి కొంచక శ్రీ వేంకటేశుఁ గొల్చి నేను శరణంటి మంచిదాయె పనులెల్లా మమ్ముఁ గాచె నితఁడూ రేకు:0218-06 బౌళి సంపుటము: 03-101 పల్లవి: ఇందుకంటే మరి యిఁకలేదు హితోపదేశము వో మనసా అంది సర్వసంపన్నుఁడు దేవుఁడు ఆతని కంటే నేరుతుమా చ. కల దొకంటే ధర్మము కల్పాంతమునకు నిలిచినది తలఁకక మీ శరణు చొచ్చి మీ దాసుడననెడి దొకమాఁట వలవని జోలే యింతాను వడి నిదిఁ గాక యేమిసేసినను సులభ మిందునే తొల్లిటి వారలు చూరలుగొనిరదే మోక్షంబు చ. మొదలొకటే యిన్నిటికి ముందర వెనకా వచ్చేది వొదుగుచు గోవిందుని దాసులకు నొక్కమాటే మొక్కినఁ జాలు తుద కెక్కనివే యితరములు దొరకొని మరేమి సేసినను బదికి లిరిందునే పరమవైష్ణవులు పలు చదువులలో వినరాదా చ. తగులొకటే విడువరానిది తతి నెన్నటికినిఁ జెడనిది వొగి శ్రీవేంకటపతి నామజపము వొకమాటే అబ్బినఁ జాలు నగుబాటే యింతాను నానాఁటి కేమేమి సేసినను తగు నీ బుదుల నడచిరి మున్నిటి దైవజ్ఞలు పూర్వాచార్యులును రేకు:0180-01 సామంతం సంపుటము: 02-397 పల్లవి: ఇందుకా కోరి పుట్టె యిట్టిబదుకు పొందుల శ్రీహరితోడిపొత్తుల మాబదుకు చ. బడబాగ్ని ఆఁకటిబారిఁబడ్డ బ్రదుకు పడఁతులకూటములC ಬಡ್ಡಿ బదుకు వొడలి తోలినెమ్మల వొడగట్టే బదుకు