పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/212

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

210 మతిలోఁ దప్పించుక మనుదురుగాని చ. మెఱయించేచన్నులే మించుఁబెట్లగుండ్లు సుండీ మెఱుఁగువమోవులే మచ్చు మేపులు సుండీ మణి మంచిమాటలు మాయపుటురులు సుండీ మఱవక తప్పించుక మనుదురుగాని చ. బలుసంసారపుపొందు పాముతోడిపొత్తు సుండీ వెలలేనివలపులు విషము సుండీ యెలమితో శ్రీవేంకటేశ్వరుమఱఁగు చొచ్చి మలయుచు సారెలయుచు మనుదుచుగాని రేకు: 0373-03 బౌళి సంపుటము: 04–430 పల్లవి: ఇందిరారమణుఁ దెచ్చి యియ్యరో మాకిటువలె పారింది యూత్రనిఁ బూజించ బొద్దాయనిపుడు చ. ధారుణి మైరావణు దండించి రాముఁదెచ్చి నేరుపుమించిన యంజనీతనయా ఘవోరనాగపాశములఁ గొట్టివేసి యీతని కారుణ్యమందినట్టి ఖగరాజ గరుడా చ. నానాదేవతలకు నరసింహుఁ గంభములో పానిపట్టి చూపినట్టి ప్రహ్లాదుఁడా మానవుఁడై కృష్ణమహిమల విశ్వరూపు పూని బండినుంచుకొన్న పొటుబంట యర్జునా చ. శ్రీ వల్లభునకు నశేషకైంకర్యముల శ్రీ వేంకటాద్రి వైన శేషమూరితీ కైవసమైన యట్టి కార్తవీర్యార్జునుఁడా యీ దేవుని నీవేళ నిట్టె తెచ్చి మాకు నియ్యరే పె.అ.రేకు:0027-01 శంకరాభరణం సంపుటము: 15-153 పల్లవి: ఇందు నందు నెంచ భేద మెంతైనఁ గలదు చిందరవందరగాక చేతికి లో నయిన్యానా చ. దేవునిఁ గొలుచువాఁడు దేవునికి కొఱగాక యీవల సంసారుల కేమి బాఁతి కావరపు మనుజుల కని కొలిచేవారికి దైవికము విచారించ తలఁ పున్నదా చ. పరము గోరేటివాఁడు పరమునకె కొఱగా కిరవై యింద్రియముల కేమి బాఁతి వొరసి భోగములలో నోలలాడే వానికి అరిది మోక్షసుఖము లాసపడనున్నదా చ. పనిగొన్న భక్తివాఁడు భక్తికి కొఱగాక యొనసి కర్మవిధుల కేమి బాఁతి మని శ్రీవేంకటేశు మాయఁ జిక్కిన వానికి తనిసి భవబంధముల దాఁటఁగఁ జోటున్నదా పె.అ.రేకు:0048-05 పాడి సంపుటము: 15-273 పల్లవి: ఇందు సాధించని యర్ధమెందున సాధింపరాదు పొందుగా పంచాశత్కోటిభూమండలమునా చ. యొక్కుడు పాపమైతేను హీనజంతువై హితము మిక్కిలి పుణ్యమైతేను మించి దేవుఁడై జనించు దిక్కుల రెండు సరియైతే మనుష్యజన్మమాను