పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/216

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

214 తీరదు భోగించక దినదినకర్మము చ. గరిమ సంసారినైతి కంటిఁ బెక్కుసుతులను యిరవుగఁ గట్టుకొంటి నీలంపటాలు వెర వేమీ నెరఁగను విడువ వెంతైనాను హరిహరి రాచినా సమయపు బలుకాంక్షలు చ. అట్టె గురుముఖమైతి నాతుమలో నినుఁ గంటి జట్టిగొని నీపాదాలే శరణంటిని గట్టిగా నలమేల్మంగకాంతుఁడ శ్రీవేంకటేశ యిట్టె నిన్నెరఁగలేని దిన్నాళ్ళు నానేరమి రేకు:0106-01 శంకరాభరణం సంపుటము:02-031 పల్లవి: ఇందుకేపో వెరగయిన్యా నేమందును కుందులేని నీమహిమ కొనియాడఁగలనా చ. అటు దేవతల కెల్ల నమృతమిచ్చిన నీవు యిటు వెన్నదొంగిలుట కేమందును పటుగతి బలీంద్రుని బంధించినట్టి నీవు సట రోలఁ గట్టువడ్డ చందాన కేమందును చ. కలిగి యూకరిరాజుఁ గరుణఁ గాచిన నీవు యిల నావులఁ గాచుట కేమందును తలఁప బ్రహ్మాదిదేవతలకుఁ జిక్కని నీవు చెలుల కాఁగిళ్లకుఁ జిక్కితి వేమందును చ. భావించ నన్నింటకంటేఁ బరమమూర్తివి నీవు యీవల బాలుఁడవైతి వేమందును కావించి బ్రహ్మాండాలు కడుపున నిడుకొని శ్రీవేంకటాద్రి నిలిచితి వేమందును రేకు:0002-05 మాళవిశ్రీ సంపుటము: 01-011 పల్లవి: ఇందుకొరకె యిందరును నిట్లయిరి కిందుపడి మఱికాని గెలుపెఱఁగరాదు చ. అటమటపువేడుకల నలయించి మఱికదా ఘటియించుఁ బరము తటుకన దైవము ఇటు సేయ నీశ్వరున కీసు గలదా? లేదు. కుటిలమత్రిఁ గని కాని గుణిం గానరాదు చ. బెండుపడ నవగతులఁ బెనఁగించి మఱికదా కొండనుచుఁ బర మొసంగును దైవము బండు సేయఁగ హరికి బంతమా? యటుగాదు. యెండదాఁకక నీడహిత వెఱఁగరాదు చ. మునుప వేల్పులకెల్ల మైుక్కించి మఱికదా తనభ క్తి యొసంగు నంతట దైవము ఘనవేంకటేశునకు గపటమా? అటుగాదు. తినక చేఁదునుఁ దీపు తెలియనేరాదు. రేకు: 0035-02 ఆహిరి సంపుటము: 01-215 పల్లవి: ఇందునందుఁ దిరుగుచు నెవ్వరివాఁడవుగాక బందెపసురమవైతి బాపు జీవుఁడా చ. తోలుబొక్కలోనఁ జొచ్చి తూలేటియాకలిచేత పాలుమాలి యిందరికి బంటుబంటవై యేలినవానిఁ గానక యేచినయాసల వెంట