పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/203

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

201 బల్లిదుఁ డాతని మాని పరుల వేఁడేదెల్లా పొల్లకట్టు దంచిదంచి పోగు సేసుకొనుట చ. యొయ్యెడాఁ బుణ్యఫలము లేమి గలిగిన హరి కియ్యకున్న నది దైవమియ్యకుండుట చెయ్యార నాతని కొప్ప సేయని భోగములెల్లా చయ్యన జెఱకుఁ బిప్పి చవిగొనుట చ. శ్రీకాంతుడై నట్టి శ్రీవేంకటేశ్వరుని జేకొంటే సిరులెల్లా జేకొనుట మేకుల శ్రీహరినామమే నోర నుడుగట కైకొన్న యమృతపుగందు వగుట రేకు: 0314-03 తోడి సంపుటము:04-080 పల్లవి: ఇంతే యింతే యీంకా నెంత చూచినా చింతలఁ జిగురులెక్కి చేఁగదేరినట్లు చ. వుల్లములో నెంచనెంచ నుద్యోగములే పెక్కు పొల్లకట్టు దంచదంచఁ బోగులైనట్టు బల్లిదుని హరినాత్మ భావించుటొకటే ముల్ల ముంటఁ దీసి సుఖమున నుండినట్లు చ. అనిన సంసారమున నలయికలే పెక్కు చానిపిం జవి వేఁడితేఁ జప్పనైనట్టు పూని హరిఁ జేతులారాఁ బూజించుటొకటే నూనె గొలిచి కుంచము నుసికిలినట్లు చ. వెనకఁ దలఁచుకొంటే విజ్ఞానములే పెక్కు తినఁ దిన వేమేల్లాఁ దీపైనట్టు చనవై శ్రీవేంకటేశు శరణను టొక్కటే పనివడి చెఱకునఁ బండువండినట్లు రేకు:0144-06 శ్రీరాగం సంపుటము: 02-199 పల్లవి: ఇంతేకాని తెలిసితే నెవ్వరూఁ గర్తలు గారు బంతినే వీని కెప్పుడుఁ బ్రకృతి గారణము చ. యివిగో గుణాలు మూఁడే యింద్రియాలఁ గూడుకొని భువిఁ బ్రాణులనెల్లాను పూఁచి పనులుగొనేవి కవిసి కర్మములై ఘనలోకాలఁ దిప్పేవి ఆవలఁ బుట్టుగులకు నప్పటిఁ దెచ్చేవి చ. పంచభూతా లివియే పరగ జీవులకెల్లా దించరాక యెప్పుడును దేహాలయ్యేవి అంచెలఁగంచములోఁ బదార్ధములై వుండినవి తెంచరాని పాశములై తీపులఁ బెట్టేవి చ. మనసాక్కటే జంతుల మర్మములు రేఁచేది తనుభోగములలోనఁ దనివిచ్చేది అనయము శ్రీవేంకటాధిప నీ మహి మిది నినుఁ గొల్చిన దాసుల నెరవేర్చేది రేకు:0203-02 గుజ్జరి సంపుటము:03-014 పల్లవి: ఇంతేపాశీ వారివారి హీనాధికము లెల్ల పంతాన తామేపాటి భాగ్యమునా పాటే చ. అందరిలో దేవుఁడుండు అందధికులు గొందరు కొందరు హీనులై కుందుదురింతే