పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/202

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

200 గతిగూడ గుంపుగట్టి కాపురము సేసీనవే మితిమీరి శిరసుపై మేఁటితుమ్మిదలు చ. కలికితనాలతోఁడ గడు మించీఁగదవే జలజాక్షివమోముననే చకోరములు పలుకులలోననే పాదుకొనె నిపు డిట్టె చెలరేగి మోవిమీఁద చిలుకమొత్తములు చ. తగు శ్రీవేంకటేశ్వరుదండ నిల్పీఁ జూడవే మగువ నడపులనే మంచిహంసలు మిగుల రతివేళను మెరసీఁ దా మిన్నిటాను పగటుఁ గుత్తికలోన పావురములు రేకు: 0388-02 పాడి సంపుటము: 04-511 పల్లవి: ఇంతులాల చూడరమ్మ ఇద్దరు జాణలే వీరు చెంత రమాదేవిఁగూడె శ్రీ నరసింహుఁడు చ. సరిఁ గొండలెక్కుకొని సరసము లాడుకొంటా సాaరిది మోములు తోఁగి చూచుకొంటాను విరులచెండులఁగొని వేటులాడుకొంటాను సిరితోడ విహరించీ శ్రీ నరసింహుఁడు చ. భవనాశి లోని నీరు పైఁ జల్లులాడుకొంటాను నవకపు సిరులను నవ్వుకొంటాను జవళిఁ గెమ్మోవులు సన్నలఁ జూపుకొంటాను చివన నిందిరనంటె శ్రీ నరసింహుఁడు చ. వేమరుఁ దొడలెక్కుక వీడుదోడు లాడుకొంటా ప్రేమమునఁగాఁగిళ్ళఁ బెనఁగుకొంటా ఆముక శ్రీ వేంకటాద్రి నౌభళాన నిలిచిరి శ్రీ మహాలక్ష్మితోడ శ్రీ నరసింహుఁడు పె.అ.రేకు:0014-02 లలిత సంపుటము: 15-075 పల్లవి: ఇంతే మరేమి లేదు యిందుమీఁదను దొంతులకర్మములెల్ల దుమ్ము దూరుపెత్తుటా చ. వుల్లములోఁ బాయకయుండి రక్షించే హరి నొల్లకుండుట తన్నుఁ దా నొల్లకుండుట బల్లిదుఁ డాతని మాని పరుల వేఁడే దెల్లా పొల్లకట్టు దంచి దంచి పోగువేసుకొనుట చ. యియ్యెడఁ బుణ్యపాపములే మిగిలిన హరి కియ్యకుండుటది దైవమియ్య కుండుట చెయ్యార నాతని కొప్పునేయని భోగములెల్ల చయ్యనఁ జెఱకుపిప్పి చవిగొనుటా చ. శ్రీకాంతుఁడై నట్టి శ్రీ వేంకటేశ్వరునిఁ జేకొంటే సిరులెల్లాఁ జేకొనుట జేకొని హరినామమే నుడుగుచు భక్తిఁ గైకొనుట అమృతము గైకొనుటా రేకు:0082-06 గుజ్జరి సంపుటము:01-398 పల్లవి: ఇంతే మటేమిలేదు యిందుమీఁదను దొంతులకర్మాలు దుమ్ముదూరుపెత్తుట చ. వుల్లములో నుండి దేహ మొగి రక్షించేహరి నొల్లకున్న తన్నుఁ దా నొల్లకుండుట