పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/201

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

199 భాసురపు భూమి మోచే బలవంతుఁ డిన్నిటాను దాసులైతే మన్నించు నీదైవముఁ గొలువరో చ. గుట్టున బ్రహ్మాండాలు కుక్షిలో నించినవాఁడు అట్టె దేవతల మొర లాలించేవాఁడు చిట్టకపు దానవుల చించి చెండాడేటివాఁడు ఇట్టే శరణంటేఁ గాచు నీతనిఁ గొలువరో చ. కాలముఁ గర్మము మాయ గల్పించినయట్టివాఁడు ఆలించి సర్వజీవుల అంతర్యామి వాలి శ్రీవేంకటపతై వరములిచ్చేటివాఁడు యేలీలఁ గొల్చిన మెచ్చు నీవిభుఁగొలువరో రేకు: 0133-02 శ్రీరాగం సంపుటము:02-133 పల్లవి: ఇంతయు నీమాయమయ మేగతిఁ దెలియఁగ వచ్చును దొంతిఁబెట్టిన కుండలు తొడరిన జన్నములు చ. కలలోపలి సంభోగము ఘనమగు సంపద లిన్నియు వలలోపలి నిడిపరులు వన్నెల విభవములు తలఁపునఁ గలిగియు నిందునే తగులకపో దెవ్వరికిని తెలిసినఁ దెలియదు యిదివో దేవరహస్యంబు చ. అద్దములోపలి నీడలు అందరి దేహపురూపులు చద్దికి వండిన వంటలు జంటఁగర్మములు పొదొకవిధమయి తోఁచును భువి నజ్ఞానాంబుధిలోనద్దిన దిది దెలియ(గరా దOబుదముల మెఱుఁగు చ. మనసునఁ దాగినపా లివి మదిఁగల కోరిక లిన్నియు యినుమున నిగిరిననీళ్లు యిల నాహారములు పనివడి శ్రీవేంకటగిరిపతి నీదాసు లివిన్నియు కని మని విడిచిన మనుజుల కాయపు మర్మములు రేకు: 0261-01 బౌళి సంపుటము: 03-349 పల్లవి: ఇంతలోనే యెచ్చరేది ఇంతలో మోసపోయేది చెంత వలసినట్లు జేసుకొంట(?) దేహికి చ. నిమిషములోనిది నింగిఁ దిరిగాడేది జమళిలోను వెలికి సరిదూఁగేది సమతైవుంటేనుండు చాలించిపోతేఁ బోవు భ్రమవంటిది ప్రాణము పట్టరాదు దేహికి చ. నీరు బుగ్గవంటిది నిచ్చ కొత్తలైనది పోరచి పంచభూతాల పొరుగైనది తీరితేనే తీరును తీరకుండితే నిలుచు నారువంటిది మేను నమ్మరాదు దేహికి చ. రేపుమాపులైనది రెండు మొకాలైనది పైపై శ్రీవేంకటేశు భారమైనది రూపై దగ్గరియుండు రుచులై యెదుటనుండు తీపువంటిది కాలము తెగదెందు దేహికి రేకు: 0159-04 ముఖారి సంపుటము:02-286 పల్లవి: ఇంతిజవ్వనవనాన నిన్నియు నెలకొనెను వంతులవాసులతోడ వలరాచపాఁజులు చ. కుతిలాలు మాని సరిఁ గూచున్నవి చూడవే సతి యురముమీఁదట చక్రవాకాలు