పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/200

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

198 కనుఁగొను చూపులు కమలనాభుఁడే యొనసి జీవునిశక్తి యేడనేడ నున్నదో చ. లోకమెల్ల మాధవుఁడే లోనెల్లఁ గేశవుఁడే వాకును కర్మము శ్రీవైకుంఠుఁడే చేకొని చైతన్యమెల్ల శ్రీనారాయణుఁడే యీకడ నే ననువాఁడ నేడ నుండువాఁడనో చ. వెనకను కృష్ణుఁడే వెస ముందచ్యుతుఁడే కొనమొదలు నడుము గోవిందుఁడే యెనయఁగ శ్రీవేంకటేశుమయ మింతాను అనుగు నాస్వతంత్ర మది యేడనున్నదో రేకు:0271-06 రామక్రియ సంపుటము: 03-411 పల్లవి: ఇంతటి దైవము లేఁడు యెందుఁ జెప్పి చూపఁగ వంతులకుఁ గొలిచేటివారి భాగ్య మిఁకను చ. గక్కన మన్మథునిఁ గన్నతండ్రి గనక యొక్కువ చక్కదనాల కితఁడే దొడ్డ నిక్కపు సూర్యచంద్రాగ్నినేత్రుఁడు గనక దిక్కులఁ గాంతుల నీ దేవుడే దొడ్డ చ. అంచెల లక్షికి మగఁడై నాఁడు గనక యెంచరాని సంపదల కితఁడే దొడ్డ పంచినచోటఁ జక్రము పంపు చేసీఁ గనక మించిన ప్రతాపాన మిక్కిలిని దొడ్డ చ. దైవికపుఁ బురుషాత్తముఁ డితఁడు గనక దేవతల కెల్లా నీ దేవుడే దొడ్డ వావాత శ్రీవేంకటాద్రి వరములిచ్చీఁ గనక యేవల దాతలలోన నితఁడే దొడ్డ రేకు: 0100-04 శుద్ధవసంతం సంపుటము:01-504 పల్లవి: ఇంతటిదైవమవు మాకు నిటు నీవు గలుగఁగ యెంతవారమో భాగ్యమేమిచెప్పే దికను చ. త్రలకొరిని వోరికకొరింత్రధనము గనినవాఁడు వెలలేనిగర్వముతో విఱ్ఱవీఁగీని బలువుతో వొకరాజుఁ బట్టి కొలిచినవాఁడు సలిగెతో నాకెవ్వరురి యనీని చ. వింతగా నొకపరుసవేది చేతఁగలవాఁడు యెంతవారిఁ గైకోఁడు యొక్కువడంటాను పొంత నొకమంత్రము పంపు సేయించుకొనేవాఁడు అంతటికి గురుఁడంటానని మురిసీని చ. యెగువ నొకదుర్గము నెక్కుక యేలేవాఁడు పగవారిఁ గైకొనక బలువయిన్యాని అగపడి శ్రీవేంకటాద్రిమీఁదనున్న నిన్నుఁ దగ నమ్మినట్టివాఁడ ధన్యుఁడ నేను రేకు:0120-02 దేసాక్షి సంపుటము: 02-116 పల్లవి: ఇంతదేవుఁ డింక వేఁడీ యెంచి చూపుఁడా చెంతనుండితే రక్షించు చేకొని కొలువరో చ. వేసితే వేయురూపులు విశ్వరూప మితఁడు శ్రీసతీశుఁడిందరిలో శ్రీమంతుఁడు