పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/199

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

197 తాలిమిలేని వేళ తగుఁగర్మము దూరితి యేలాగని కాచేవారి నెవ్వరిఁ గానము చ. దైవమును దూరితి తమకించినట్టివేళ కావించి నన్నే దూరితిఁగాఁగినవేళ సోవగాఁ గోపపు వేళ చుట్టాల దూరితిమి యిూవలఁ దోడైనవారి నెవ్వరిఁ గానము చ. పుట్టుగు దూరితిమి పోరానియట్టివేళ కట్టఁగడ నెందువంకఁ గానమైతిమి జట్టి శ్రీవేంకటేశుఁడు శరణంటేనే కాచె యిట్టె యింతటివారు యెవ్వరును లేరు రేకు:0277-02 సామంతంసంపుటము: 03-443 పల్లవి: ఇంతటఁ గావఁగదే ఇందిరానాయక నన్ను పంతానం గాకాసురునిఁ బాలించినట్లు చ. దించని పంచభూతాల దేహము మోచితిఁ గాన నించిన యజ్ఞానమున నిన్ను నెరఁగ పంచేంద్రియములచేఁ బట్టువడ్డవాఁడఁ గాన యెంచరాని పాపములే ఇన్నియు జేసితిని చ. మిన్నువంటి జఠరాగ్ని మింగివున్నవాఁడఁ గాన కన్నవెల్లా వేఁడి వేఁడి కష్టపడితి పన్నిన సంసారపు భ్రమ బడ్డవాఁడఁగాన అన్నిటా దేవతలకు సరిగాఁపనైఁతి చ. ఆతుమలో నీ వుండే భాగ్యము గలవాఁడఁగాన చైతన్యమున నీకు శరణంటిని నీతితో శ్రీవేంకటేశ నీ పాలివాఁడఁగాన బాతితో సర్వము నీ కొప్పనము సేసితిని రేకు: 0193-01 దేసాళం సంపుటము: 02-474 పల్లవి: ఇంతటఁ బో కానవచ్చు నెక్కువ తక్కువలెల్ల దొంతి ఇంద్రియాలకెల్లఁ దొలఁగి వుంటేను చ. మాటలాడవచ్చుఁ గాని మనసులు పట్టరాదు చాటువకెక్కినయట్టి సతులఁ గంటే కోటి చదువఁగవచ్చు కోపము నిలుపరాదు జూటరై వొకఁడు దన్ను సోఁకనాడితేను చ. అందరి దూషించవచ్చు నాసలు మానఁగరాదు కందువైన మించుల బంగారు గంటే అందాల మొక్కఁగవచ్చు హరిభక్తి సేయరాదు పొందుల సంసారపు భోగము గంటేను చ. మొదలఁ బుట్టగవచ్చు మోక్షముఁ బొందఁగరాదు పొదిగి పుణ్యరాసుల భోగము గంటే యెదుట శ్రీవేంకటేశ ఇదివో నీ శరణంటే కదిసితి నిట్టే పో నీకరుణ గంటేను రేకు: 0191–02 శంకరాభరణం సంపుటము: 02-463 పల్లవి: ఇంతటా హరినేకాని యెందునను గాన నన్ను కొంత నాకుఁ దెలుపరో గురువులాల చ. తనువూ హరియే తలఁపూ హరియే వినికి మనికియును విష్ణుఁడే