పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/204

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

202 చెంది వీచే గాలొకటే చేనిపంటూ నొకటే పొంది గట్టి కొలుచుండి పొల్లు కడఁబడును చ. పుట్టు గందరి కొకటే భూమిలో యేలికలును వెట్టిబంట్లఁ గొందరై వీఁగుదురింతే చుట్టి వరిగురుమతో జొన్నగింజ సరిదూఁగు తెట్టెలై మేలొకటికి తీలోకటి కాయ చ. కోరి శ్రీవేంకటపతి కుక్షిలోనే లోకములు ఆరయఁగిందెడుమీఁదెడై వున్నవింతే యీరీతి నితని దాసు లెక్కిరి పొడవులకు తారి కిందికి దిగిరి దానవులై కొందరు పె.అ.రేకు:0052-05 దేశాక్షి సంపుటము: 15-297 పల్లవి: ఇంతేసివారలకంటే నెక్కుడా తాము సంతతము గోవిందుదాస్యమే మూలధనము చ. అరసి యెఱుఁగఁడా బ్రహ్మ జ్ఞాన మింద్రుఁడు సరిలేని వేదాంతము చదువఁడా హరినే ప్రార్ధన చేసి యాపద గడచినాఁడు యిరవై స్వతంత్రమున యింతా మిథ్య యనెనా చ. కమలజుం డెఱుఁగఁడా కడు బ్రహ్మజ్ఞానము నెమకి శాస్తార్ధము నిశ్చయింపఁడా విమలపు విషు గొల్చి వేదములు వడయఁడా తమితో నాతఁ డేమైనాఁ దానె బ్రహ్మమనెనా చ. శివునకు లేదా మించిన బ్రహ్మజ్ఞానము తవిలి పరతత్వము దలపాశీయఁడా జవళి శ్రీవేంకటేశు జపించి వారణాశిలో రవళి తాఁజెప్పేమంత్రము గల్ల యనెనా రేకు:0239-05 మాళవిగౌళ సంపుటము: 03-226 పల్లవి: ఇంద రెరిఁగినపని కిఁకఁ దప్పించుకోరాదు పొందుగాని మాయలఁ బొరలఁగ నేఁటికి చ. గతియై బ్రహ్మాండాలు కల్పించ నేరిచి సుతులై బ్రహ్మాదులు చూపట్టఁగా క్షితి వేదశాస్త్రాలచేతఁ బొగడించుకొంటా నితరు లెరఁగకుండా నింత దాఁగనేఁటికి చ. వున్నత పరమపద మొసఁగ నీవు గర్తవై అన్నిటా లక్షీనాథు(డవనఁ బెOపారిOది పన్నుకయిన్నివిద్యలాఁ బ్రసిద్దుఁడై వుండి కన్నులకుఁ బ్రత్యక్షముఁ గాకుండ నేఁటికి చ. సురల యాపదలెల్లా సులభాననె తీర్చి పరగ ధర్మములెల్లాఁ బరిపాలించి పరుషలకు వరాలు పలుమారుఁ గృపచేసి మరిగి శ్రీవేంకటేశ మాటాడ వదేఁటికి చి.ఆ.రేకు:0010-02 నాట సంపుటము: 10-056 పల్లవి: ఇందరి జూచి చూచి యెఱఁగవద్దా బందెపసులకు మెడ పన్నించ నేలా చ. యినుమునఁ జేసిరా యెవ్వరిదేహమైనా పొనిఁగి పోతేఁబోవు పాణికుంటే మాను