పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/196

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

194 చ. కర్మహరము శ్రీకాంతు దరిశనము ధర్మరాసి మాధవుశరణు అర్మిలి సంపద లనంతుని తగులు నిర్మలముగఁ బూనిన దాసులకు చ. ఆగమోక్తమీ హరికైంకర్యము భోగము విష్ణునిపూజ యిది యోగము శ్రీవేంకటోత్తముని కొలువు బాగులు నేర్చిన ప్రపన్నులకును రేకు: 0157-04 శంకరాభరణం సంపుటము: 02-272 పల్లవి: ఇంతకంటె నేమిసేసే మిదే మా మానసపూజ సంతతము నీవు తొల్లే సర్వసంపన్నుఁడవు చ. అంతర్యామివైన మీకు నావాహనమదివో అంతటా విష్ణుఁడ మీకు నాసనము వేసినది పంతపుఁకోనేరే మీకుఁ బలుమారు నర్థ్యము చెంతనే గంగాజలముచల్లే మీకుఁ బాద్యము చ. జలధు లన్నియును నాచమనియ్యము మీకు అల యా వరుణజల మిదియే స్నానము వలనుగా మీమహిమలే వస్త్రాభరణములు అల వేదములే మీకు యజ్ఞోపవీతము చ. ఇరవుగఁ గుబ్ద తొల్లిచ్చినదే మీకు గంధము ధర మాలాకారుని పూదండలే మీకు పువ్వులు ఉరుగతి మౌనుల హోమమే మీకు ధూపము తిరమైన మీకు రవితేజమే దీపము చ. నానామృతములే మీకు నైవేద్యతాంబులములు పూనిన భక్తి షోడశోచారములు ఆనుక శ్రీవేంకటేశ అలమేల్మంగపతివి తానకపు జపములే తగ మీకు నుతులు పె.అ.రేకు:0070-02 మంగళకౌశిక సంపుటము: 15-401 పల్లవి: ఇంతకంటె మఱి నీవు యేమి సేతువు పంత మారుకో రాదు నా భావము నీ చేతిది చ. పిలిచితే నాలికపైఁ బెనగొని వున్నాఁడవు తలఁచితే మదిలోన దక్కి వుందువు