పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/197

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

195 యెలమిఁ జాచితే కన్నులెదుటనే వున్నాఁడవు కొలచి బ్రతికేవారికొలఁది భాగ్య మిఁకను చ. చేరి నిన్నుఁబూజించితే చేతిలో నున్నాఁడవు ఆరగించుమంటే కళ్లందుకొందువు నేరుపుతో మొక్కుకొంటే నీపై భక్తి చేకొందువు కూరిమిఁ గొలిచే వివేకుల భాగ్య మిఁకను చ. సత్తుగాఁ జదివితేను చదువలందున్నాఁడవు వొత్తి నిన్నుఁబొగడితే వొద్ద నుందువు హత్తి శ్రీవేంకటేశ అలమేల్మంగపతిని చిత్తము రా సేవించే జీవుల భాగ్య మిఁకను రేకు:0144-04 భైరవి సంపుటము: 02-197 పల్లవి: ఇంతకంటే నే మున్నది యెంత దలపోసినాను చింతదీర నీ సేవ సేయుటే కలది చ. ఉపకారముగ దేహమొసంగితి విటు నాకు ఉపమించి నేఁజేసే ప్రత్యుపకార మిఁక నేది యెపుడూ నీధర్మమున నిటు నీరుణసుఁడనై ప్రపన్నుఁడనై నేను బ్రదుకు టే కలది చ. వేవేగ వెట్టి జేయక వివేకిఁ జేసితివి యీవికి నే మారుకు మా రిచ్చే దెక్కడ నున్నది యీవల నీకుఁ గీర్తిగా నిట్టే నీయాధీనుఁడనై భావించి భయము లేక బ్రదుకు టే కలది చ. జడులలోఁ గూర్పక యాచార్యునిలోఁ (తోఁ?) గూర్చితివి నడపేటి నీసరవికి నాసరివి యేమున్నది యెడయక శ్రీవేంకటేశ నీకు బంటనై బడివాయ కిట్టా నే బ్రదుకుటే కలది రేకు: 0169-02 దేవగాంధారి సంపుటము:02-334 పల్లవి: ఇంతకంటే మరిలేదు యెవ్వరికి నుపాయము యెంతైనా నిదియు నీ విచ్చితేనే కలుగు చ. హరి నీచిత్తము వట్టేయందుకు నుపాయము ధర నిన్ను బోధించే నీదాసులమాఁటే దురతములన్నిటిని తొలగించే వుపాయము నిరంతరమును నీనామజపమే చ. దండితోడ నీమాయ దాఁటేయందు కుపాయము నిండు నిధానమైన నీపైభక్షే అండనున్న కామాదుల నణచుట కుపాయము కొడవంటి నీమూర్తిఁ గోరి శరణనుటే చ. పుట్టుగులు గెలిచి నిన్ను బొందుట కుపాయము అట్టె నీరూపమైన ఆచార్యుడే యిట్టె శ్రీవేంకటేశ యిన్నిటికి నుపాయము మట్టులేని రామానుజమతము చేకొనుటే రేకు: 0180-04 రామక్రియ సంపుటము: 02-400 పల్లవి: ఇంతకంటేఁ దగుబంధు లింక నున్నారా యెంత సేసినా నీకు నెదురాడేనా చ. కోపగించి చంకజడ్డఁగోరీ తల్లి డించితేను పైపైనే పడుఁగాక పాసిపొయ్యినా