పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/195

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

193 చ. నరకము వెళ్లఁ దీసె నన్ను నీ సాహసము సరగ జ్ఞానిఁ జేసె నీ చాతుర్యము మరిగించుకొనె నన్ను మఱి నీ వాత్సల్యము యిరవాయె నా వేడుక యేమి చెప్పే దింకను చ. నన్ను లోకపూజ్యుఁ జేసె నాఁడే నీ దొరతనము విన్నపము లాలించే నీ విచారము మన్నించె శ్రీవేంకటేశ మమ్ము నీ పట్టపుదేవి యిన్నిటా బ్రదికించితి వేమి చెప్పే దింకను పె.అ.రేకు:0069-02 గౌళ సంపుటము: 15-395 పల్లవి: ఇంత సేసినవాఁడవు యిఁక నన్నేలక పోదు చింత దీర నీవే రక్షించుకొంట గాకా చ. మక్కువ నీతో నేను మాటాడి యెఱుఁగుదునా చొక్కపు నీవైన రూపు చూపితివా నిక్కము నీ వుండేటి నెలవు దెలిసితినా చిక్కి నీవే నా మది నిల్చితి వింతే కాక చ. కోరి నీ యవతారాల కూడిమాడి యూడితినా యేరీతి నైనా సేవ సేయించుకొంటివా నేరిచి వొకనాఁడైనా నిన్ను నేఁ దలఁచితినా వూరకే నీ కృప నాపై నుంచితివి గాకా చ. యెన్నఁడైనా నిన్ను నేను యెనసి కొలిచితినా నిన్న దేవ రనుచు నెమకితినా పన్నుగా నలమేల్మంగపతి శ్రీవేంకటేశ తిన్నఁగా నన్నుద్ధరించితివి నీవే కాక రేకు:0046-03 కన్నడగౌళ సంపుటము: 01-282 పల్లవి: ఇంత సేసెఁబో దైవ మింతలోననే అయ్యో సంతపాకలంజఁ దెచ్చి సన్యాసింజేసె చ. పరిగెలేరేటివానిఁ బట్టపురాజుఁగా నిరతభోగము లిచ్చి నిలిపినట్లు ధరలోన నతిపాతకుని నన్ను నిట్లు అరయ నిత్తడిఁ దెచ్చియపరంజిఁ జేసె చ. కుక్కలవండుకతినే కులహీనునిఁ దెచ్చి వెక్కసఁబాఁపనిఁ గావించినయట్లు దిక్కులెఱఁగఁగఁ గష్టదేహిని నన్నుఁ దెచ్చి గక్కనఁ దెలుకపిండి కసూరి సేనె చ. చెడుగైనదోమఁ దెచ్చి సింహపుఁగొదమఁగా బెడిదంపుఁ బ్రేమతోడఁ బెంచినయట్లు కడునధముని వేంకటపతి నను నిటు చిడిపిరాయి దెచ్చి చింతామణి సేనె రేకు: 0245-06 సామంతం సంపుటము: 03-259 పల్లవి: ఇంతకంటె ఘన మిఁక లేదు సంతతసౌఖ్యము జనార్దనుఁడే చ. భయనివారణము పరమాత్ముని నుతి జయకారణ మీశ్వరచింత అయుతపుణ్యఫల మచ్యుతునిసేవ క్రియతో నిజ మెరిఁగినవారికిని