పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/194

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

192 చ. చచ్చినభావమె బ్రతికిన యప్పుడు శరీరసుఖములు మఱచిన ముక్తుఁడు యిచ్చల మృతునకు విభవము సేసిన యేడకు నెక్కుదు వృధా వృధా మెచ్చుగ నొరులకు నిచ్చిన యర్ధము మీఁదమీఁద ఫలియించు తెచ్చి లోభమున దాఁచిన ధనములు తీరక భూగతమైయుండు చ. యిలువేలుపైన శ్రీవేంకటేశ్వరు నెఱిఁగి కొలిచినను భవ మీ డేరును పలుకర్మంబుల నెంత దొరలినా ప్రయాసములే కడు ఘనము అలమేల్మంగ పురుషాకారమున ఆచార్యుననుమతి మెలఁగును వలవని లావుల వశగతుఁడై నను వానిచందములు హరియే పె.అ.రేకు:0077-04 బౌళిరామక్రియ సంపుటము: 15-444 పల్లవి: ఇంత మాత్రము మా నేమ మిందు నీ కేమి గూడీని చెంత ధర్మమునకు రక్షించేవు నీవు నన్ను చ. పిడికెఁడు బియ్యమే పెద్దరికంబగు చెలిమి తొడిఁబడ సంధ్య మూఁడుదోసిళ్లు నీళ్లు నుడిగే జపము వేళ్ల నూఁటయెనిమి దెంచేది తడుపుకొనేది తీర్థస్నానము లన్నియును చ. వూరక యూకలి గొని వుండేది మా వ్రతములు నీరసపు టాహారాలు నిష్టలెల్లాను వూరఁ దోఁటల పువ్వు లొగి దేవపూజలు గోరమైన బతుకులు కోరేటి తపములు చ. బలసాకు తిలలు దర్భలు పితృపూజలు పలుకకుండేది మా బలు మోసము యిలపై శ్రీవేంకటేశ యిందు నిన్న మెప్పించే మా కలిగినది మూకు నిఁక మణి కాకా రేకు: 0334-03 బౌళి సంపుటము:04-198 పల్లవి: ఇంత లేకుంటే నది యొక్కడి సుజ్ఞానము దొంతుల తనజన్మము తొల్లిటిదే కాదా చ. యెదిటి వారెరిఁగితే యేమీ ననక మరి చెదరకుండుటే పో శ్రీవైష్ణవం కదిసినకాంతలను కనకము వొడగంటే పదరకుండుటే పో పరమసాత్వికము చ. క్రియయెరఁగనివారు కీడు సేసితేఁ దాను దయఁ జూచుటే హరిదాస్యఫలము రయమునఁ దామసము రాజసము గలిగితే భయపడి తొలఁగుటే ప్రసన్నగుణము చ. వొరసి యెవ్వఁడు దను నుబ్బించి పొగడిన నిరతితొ వీఁగనిదే నిచ్చలబుద్ది యిరవై శ్రీవేంకటేశ్వరుదాసులఁ గని శరణని మొక్కుటే సర్వజ్ఞగుణము పె.అ.రేకు:0073-05 శ్రీరాగం సంపుటము: 15-421 పల్లవి: ఇంత సేయకుండితే నే సేడ నుందును యెంతపుణ్యమో నీకు యేమి చెప్పే దింకను చ. అట్టె నన్నుద్ధరించినయదె నీ ప్రతాపము వొట్టి సంపన్నుఁ జేసె నీ వుదారత్వము గుట్టున వెనకవేసుకొనెను నీ పంతము యిట్టి నా భాగ్యము నేఁడు యేమి చెప్పే దింకను