పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/193

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

191 చ. పంచభూతపు చుట్టాల బదుకులోవాఁడ నింతే యొంచ కింద్రియయాచకు లేల వచ్చేరు కంచపు గాలావటించే కలిమిలోవార మింతే చంచలపుటాసలు చేయి చాఁచనేఁటికి చ. నెత్తురుజలదుర్గాన నిలిచినవాఁడ నింతే జొత్తుఁబాపములు యేల చోటడిగేరు హత్తిన శ్రీవేంకటేశుఁడాత్మలోన నున్నవాఁడు మత్తపుటజనమా మమ్మేమి చూచేవు రేకు:0231-02 రామక్రియ సంపుటము: 03-175 పల్లవి: ఇంకా నో దైవమా యేల వెట్టి దవ్వించేవు కొంకి తెంచి ముడిగొంటే కుఱుచే కాదా చ. పైకొని నీదాసులు బ్రహ్మాదులఁ గొల్వమని లోకులఁ గొల్పితే వారు లోలో నవ్వరా కోక చాకియింట వేసి కొక్కెరాలవెంటఁ బోతే ఆకడ పురుషార్థము నందీనా జీవుఁడు చ. వుమ్మడిఁ గర్మఫలము వొల్లమని పసిఁడికి నమ్మిక చేయి చాఁచితే నవ్వదా అది కమ్మిశిరసుండఁగా మోకాల సేస వెట్టఁబోతే సమ్మతి నిందరిలోన జాణా నా జీవుఁడు చ. సారెకు మాయాప్రపంచమునకు లోనుఁ గాక నారులకు లోనైతే నవ్వరా వారు యీరీతి శ్రీవేంకటేశ ఇన్నిటా నీశరణని కూరవండి కసవేరిఁ గోరీనా జీవుఁడు రేకు: 0261-05 బౌళి సంపుటము: 03-353 పల్లవి: ఇంకానేలా తర్కవాదములు యిన్నియు నిందునే ముగిసెను యింకానేలా కొందరు మోక్షం బెవ్వరికిని లేదనుమాటా చ. సరయువు పారింతను సకల జీవులకు సిరుల మోక్షమిచ్చితివని విన్నపుడే మరలుచు నాయునుమానము వాసెను ధర నీవొకఁడవే దైవమవని కంటినయ్యా చ. తగిన లంకవొద్దను రాక్షసులను తెగనడిచి ముక్తితెరువు చూపినపుడే వగలఁ బెక్కుదేవతల వరంబులు జగతి నీపగకు సరిగావయ్యా చ. యేమని చెప్పదునిట్టి నీ మహిమ వేమరుఁ బురాణవిధి విన్నపుడు శ్రీమంతుఁడవు శ్రీవేంకటేశ్వర కామింప నీకంటే ఘనము లేదుగదవోఅయ్యా పె.అ.రేకు:0070-01 గుండక్రియ సంపుటము: 15-400 పల్లవి: ఇంచుకంత ధర్మములో నున్నది యిందరి మేలునుఁ గీడును వంచనతోడుతఁ గైకొనఁ దలఁచిన వారలనేరవు లింతేకాని చ. నరకము లనుభవించితి నని తలఁచిన నలిఁజెడుఁబ్రారబ్దకర్మములు పరదారాదులఁ గలయఁ దలఁచిన పాపములెల్లనుఁ జుట్టుకొను సురల చరిత్రము వినినయంతలో సుకృతియై వెలయుఁ బురుషుడు దురితచిత్తుల విధంబులు వింటే దుష్కృత్యములకును గుణియిగును