పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/192

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

190 చ. కన్నవారెవ్వరు ఘన వైకుంఠము వున్నతమగు నీ వురుమహిమ మున్ను నిపుడు నీ ముద్రలు మోఁచిన అన్నిటా ఘనసనకాదులుఁ గాక చ. తెలియువారెవ్వరు దివ్యజ్ఞానము చలనముగాఁ జెప్పు శాస్త్రములు యిలలో శ్రీవేంకటేశ నీవారై చెలఁగిరి శేషాదిజీవులుఁ గాక రేకు:0244-04 సాళంగనాట సంపుటము: 03-251 పల్లవి: ఇంకనేల నాకు వెరపింతమాట గలిగియు సంకెలెల్లఁ బాసె నాస్వతంత్రము లొక్కటే చ. నేనెంత పాపబుద్ధినై నేరమెంత సేసినాను కానీలే నన్నెలేవాఁడు కావఁగలఁడు ఆనతిచ్చెఁ దొల్లె యాతఁడదె చరమార్ధమందు మేనిదోసమెల్లఁ బాపి మేలొసఁగేననుచు చ. మట్టులేకతనినెంత మరచి నే వుండినాను పుట్టించిన దేవుఁడే ప్రోవఁగలఁడు గుట్టుచూపె తొల్లె తన గుణము పాండవులందు గట్టిగాఁ దనవారైతే కాచుకుందుననుచు చ. తప్ప నే నడచినాను తగిలి శ్రీవేంకటేశుఁడొప్పలు సేసి రక్షించ నొద్దఁగలఁడు చెప్పనేల గోపికలు సేసిన దోసాలు దొల్లి కప్పక పుణ్యాలు సేసె ఘనుఁడఁ దాననుచు రేకు:0258-01 సామంతం సంపుటము: 03-331 పల్లవి: ఇంకనైన హరిఁ జేరు యింతే చాలు సంకెలెల్లాఁ బెడఁబాపి చక్కఁజేసీ నతఁడే చ. యెఱఁగక పుట్టితివి యిన్నియోనులందుఁ దొల్లి తట్రినాఁటి కాయఁబోయ దానికేమి నెఱి నఱకములో నాని తివియుఁ గొన్నాళ్ళు తఱవాయి దెలుసుకో దానికేమి చ. పాపపుణ్యములు సేసి పరులఁగొలిచి తొల్లి తాపములఁ బొందితివి దానికేమి వూపసంసారము నమ్మి పుంగుఁడై యిన్నాళ్ళదాఁకా దాపులేక బ్రతికితి దానికేమి చ. జగములో వారిఁ జూచి సారెసారె నాసలనే దగదొట్టె నీకుఁ దొల్లి దానికేమి జిగి శ్రీవేంకటపతి చిత్తములో నున్నవాఁడు తగవెంచుకో జీవుఁడ దానికేమి రేకు:0258-04 దేవగాంధారి సంపుటము: 03-334 పల్లవి: ఇంకనైనా రోయరాదా యీ పాటివార మింతే మంకుఁదనమేల మామాట వినరాదా చ. తోలుబొంత గట్టుకొన్నదొర నింతే నన్ను నీవు కూళసంసారమా యేల కొసరేవు యీలకొన్న యొుముకల ఇంటిలో కాఁపుర మింతే యేల మాయ వెంటఁబెట్టే వేమి గద్దు నీకును