పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/191

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

189 చ. దేవలోక మొక్కటే దేవేంద్రు లెందరో కైవశమై యేలఁగ నొక్కరిదీ గాదు ఆవటించి పంచభూతాలనేటి శాఖలు వెళ్లి సావధానానఁ బెరిగీ సంసారవృక్షము చ. యిచ్చట నీ వొక్కఁడవే యిటు నీదాసు లెందరో తచ్చి యెంత సేవించినాఁ దనివిలేదు నిచ్చలు శ్రీవేంకటేశ నిదానము నీభక్తి యొచ్చినాఁడ వింతటా నీడేరీ జన్మము రేకు: 0246-06 ఆహిరి సంపుటము: 03-265 పల్లవి: ఇంక నా దైన్యము చూచి యెట్టు రక్షించేవో కాని సంకె దీరఁ బులిసితి సర్వేశ్వరా చ. తపము సేసి నీ మాయ దాఁటేననుచుఁ బెనఁగి అపుడే యలసితిని అదివో నేను కృపఁ జూచి నీ వింక గెలిపించేదెట్లోకాని వుపముల సరివోరి వోడితి నే వానికి చ. పంచేంద్రియములను పారఁదోలేనని చూచి వంచంగ సత్వలేక వసమైతిని అంచె నాపాటు చూచి నీవడ్డమౌటెప్పుడోకాని దించని బీరములాడి దిగితి నే వానికి చ. మోహాంధకారముపై మొనచూపేనని పోయి సాహసము లేక నే జడిసితిని వూహల శ్రీవేంకటేశ వున్నతి నన్నేలితివి బాహుబలమున తుదిపదమయిత్రి వానికి రేకు: 0343-03 లలిత సంపుటము: 04-252 పల్లవి: ఇంక నేమిసేసేము యిన్నిటాఁ దనిసితిమి సంకెలెల్లాఁ దీరెఁ దీరె చాలుఁజాలుఁ గర్మము చ. కోరి పుణ్యము లేమైనాఁ గొన్ని సేసేముంటిమా కోరిక లిచ్చేటి హరి కూడి మాలోనున్నాఁడు చేరఁ జోటు వెదకి పొంచి త్రిరిగేముంటిమా చేరేటివైకుంఠపతి చేతిలో నున్నాఁడు చ. భవహరముగ వేదపఠన సేసేమంటే భవహరమగుహరిపాటలు నోట నున్నవి తవిలి సంపదలకై దానమిచ్చేమంటిమా భువిలోన శ్రీపతి మాపూజలో నున్నాఁడు చ. యిహసుఖములకుఁగా యిందరి వేఁడేమంటే యిహమిచ్చేశ్రీవేంకటేశుఁ డెదుట నున్నాఁడు సహజమయినయట్టిసర్వేశఁ డీతడే మహిమలన్నియుఁ దానె మాకు నిచ్చినాఁడు రేకు:0295-06 బౌళి సంపుటము: 03-553 పల్లవి: ఇంక మా బోంట్ల కేది విధో కింకరులమనియెడి గెలుపే కాక చ. యెవ్వరు గడచిలి యింతక తొలుతను నివ్వటిల్లు హరి నీమాయ నవ్వుచు నీ శరణాగతి నమ్మిన మువ్వంక శుకాదిమునులే కాక