పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/190

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

188 చ. కాయము గడపల గనుదాఁక యూ మాయ దన్ను వెడమరుదాఁక రాయడి మదము గరఁగుదాఁక యినా - రోయఁదగిన తనరూపమే సుఖము చ. లంకెలఁ బొరలి నలఁగుదాఁక యూ యుంకెల భవము లెరవె°దాఁక వేంకటపతిఁ దడవిన దాఁక యీ కింకురువాణపు గెలుపే సుఖము రేకు: 0317-02 దేవగాంధారి సంపుటము:04-097 పల్లవి: ఆహా నమో నమో ఆదిపురుష నీకు యివాహల నేనెంతవాఁడ నెట్టు గాచితివి చ. లోకాలోకములు లోన నించుకొన్న నీవు యీకడ నాత్మలోన నెట్టణఁగితి ఆకడ వేదములకు నగోచరమైన నీవు వాకుచే నీనామములఁ వడి నెట్టణఁగితి చ. అన్నిటా బ్రహ్మాదుల యజ్ఞభోక్తవైన నీవు అన్నపానములివి యెట్టారగించితి సన్నుతి పూరుఁడవై జనియించిన నీవు వున్నతి నాపుట్టుగులో వాకచో నెట్టుంటివి చ. దేవతలచే పూజ తివిరి కొనిన నీవు యీవల నాచే పూజ యెట్టు గొంటివి శ్రీవేంకటాద్రి మీఁద సిరితోఁ గూడిన నీవు యీవిధి నాయింట నీవు యెట్టు నిలచితివి పె.అ.రేకు:0073-02 సామంతం సంపుటము: 15-418 పల్లవి: ఆహా యేమి చెప్పేది హరి నీ చిక్కు ఊహా పోహలచేత వుడివోవు వయసు చ. చేతఁ జిక్కినట్లుండు చెప్పినదాఁకా జ్ఞానము ఆతలఁ గడచితేను అట్టటు వోవు ఆూతఁ జేసినట్టుండు నాఱడి దేహ మాయుష్యముతో ఆతుమ యెడసితేను అదవదలవును చ. నిక్కమువలెనే వుండు నిద్రించుదాఁకాఁ గల పక్కన మేలుకొంటేను బట్టబయలు దక్కిన యట్లనే వుండు ధనధాన్యములు యింట చక్క ననుభవించితే సరికి సరి యాను చ. సులభమువలె నుండు చూచేటి యీ లోకము యిలఁ జేకొనఁగోరితే నెల యించును యెలమి శ్రీవేంకటేశ యిది నీ కల్పితమే తలపాశీసి మెలఁగ నీదాసు లెఱుఁగుదురు రేకు:0140–01 శంకరాభరణం సంపుటము: 02-172 పల్లవి: ఆహా యేమి చేప్పేది హరి నీమాయ మోహములే చిగిరించీ మొదల జవ్వనము చ. యెంచఁగ భూమి యొక్కటే యేలినరాజు లెందరో పొంచి వారివెంటవెంటఁ బోవదాయను అంచల సూర్యచంద్రులనే గడెకుడుకల ముంచి కొలచి పోసీని మునుకొని కాలము