పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/188

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

186 పరమ పరానంద పరమపురుషా కరిరాజవరదా కారుణ్యనిలయా శరణాగతుఁడ నన్ను సరిఁగావవే చ. అణువులోపలి నీవు ఆదిమహత్తును నీవు ప్రణుత శ్రీవేంకటప్రచురనిలయా అణిమాదివిభవా ఆద్యంతరహితా గణుతించి నాపాలఁ గలుగవే నీవు రేకు:0118-06 బౌళి సంపుటము:02-108 పల్లవి: ఆర్పులు బొబ్బలె నవె వినుఁడు యేర్పడ నసురల నిటువలె గెలిచే చ. కూలిన తలలును గుఱ్ఱపు డొక్కలు నేలపైఁ బారిన నెత్తురులు వోలిఁ జూడుఁ డిదే వుద్ధగళలీ రణకేలిని విష్వక్సేనుఁడు గెలిచె చ. పడిన రథంబులు బాహుదండములు కెడసిన గజములు గిరెడగులును అడియాలము లివె అక్కడ విక్కడ చిడుముడి విష్వక్సేనుఁడు గెలిచె చ. పగుల పగుల వృషభాసురునిఁ జంపె పగ నీఁగె అతని బలములతో అగపడి శ్రీవేంకటాధిపు పంపున జిగిగల విష్వక్సేనుఁడు గెలిచె రేకు:0096-02 శంకరాభరణం సంపుటము: 01-478 పల్లవి: ఆలవటపత్రశాయివైనరూప మిట్టిదని కొలువై పొడచుపేవా గోవిందరాజా చ. పడఁతులిద్దరిమీద బాదములు చాఁచుకొని వొడికపు రాజసాన నొత్తగిలి కడలేని జనాభికమలమున బ్రహ్మను కొడుకుఁగా గంటి విదె గోవిందరాజూ చ. సిరులసామ్ములతోడ శేషునిపైఁ బవళించి సారిది దాసులఁ గృపఁ జూచుకొంటాను పరగుదైత్యులమీఁద పామువిషములే నీవు కురియించిత్రివిగా గోవిందరాజా చ. శంకుఁజక్రములతోడఁ జాఁచినకరముతోడ అంకెల శిరసు కింది హస్తముతోడ తెంకిన శ్రీవేంకటాద్రి దిగువతిరుపతిలో కొంకక వరములిచ్చే గోవిందరాజా రేకు:0005-02 ఆహిరి సంపుటము: 01-030 పల్లవి: ఆలాగుపారిందులును నటువంటికూటములు యీలాగులౌట నేఁడిదె చూడనయితి చ. అడియూసచూపులకు నాసగించితిఁగాని వెడమాయలని లోను వెదకలేనైతి కడువేడుకలఁ దగిలి గాసిఁ బొందితిఁగాని యెడలేనిపరితాప మెఱఁగలేనైతి చ. చిరునగవుమాటలకుఁ జిత్తగించితిఁగాని