పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/187

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

185 తెమ్మగా శివమాడి తా దేవరైనట్టు కిమ్మల యీజన్మనందు కిందుమీఁదు నేఱక పమ్మి భోగములనే తెప్పలఁ దేలేమయ్యా చ. బాలులు యిసుకగుళ్లు పస గట్టు కాడినట్టు వీలి వెట్టివాఁడు గంతువేసినయట్టు మేలిమి శ్రీవేంకటేశ మిమ్ముఁ గొలువక నేము కాల మూరకే యిన్నాళ్ళు గడపితిమయ్యా రేకు: 0317-04 ధన్నాసి సంపుటము:04-099 పల్లవి: ఆయంబిది తెలియంగల దీయాత్మజ్ఞానంబు మాయలు యీకాలము కర్మము మాధపునాధీనము చ. దేహమునకు నీడ తిరిగినయటువలెనే శ్రీహరికి కళావిధమై జీవుఁడటు దిరుగు దేహమునకుఁ గల చైతన్యము తెగి నీడకులేదు శ్రీహరికిని గల స్వతంత్రము జీవునికిలేదు చ. కలలోపలఁ గల సుఖము ఘనసంతోషము కొరకే యిల లోపలఁ గలిగిన సుఖము ఇది సంతోషము కొరకే కలలోపలి విజీవుని సంకల్పన లిన్నియును ఇల లోపలి ప్రపంచ మింతయు నీశ్వరుసంకల్పము చ. చెదరిని బాహ్యపునిషయములు జీవునిపాలిటివి పదిలంబగు అంతరంగమే పరమపువైకుంఠము అదనెరిఁగి కాలగాలమున ఆతుమ శ్రీవేంకటపతికి పొదిగి యాతనికి శరణని కొలిచిన పొందగు ముక్తికి యిది గీలు రేకు:0175-02 సామంతం సంపుటము: 02-370 పల్లవి: ఆరసి వేరొకచో ముక్తడుగఁగవలదు సారపు లౌకికవిమోచనమే ముక్తి చ. మొగిఁ బుణ్యపాపవిముక్తియే ముక్తి వెగటుఁ బ్రపంచపు విముక్తే ముక్తి తగులు సంసారబంధవిముక్తే ముక్తి జగములోఁగలుగు యూశాముక్షే ముక్తి చ. కామక్రోధాదిసంగ విముక్షే ముక్తి వేమారు రుచులపై విముక్తే ముక్తి నాముల దేహభిమానపు ముక్తే ముక్తి పామెడి కోరికలసంపద ముక్షే ముక్తి చ. ముందువెనకల కర్మమోచనమే ముక్తి అంది సుఖదుఃఖభయ ముక్తే ముక్తి కందువ శ్రీవేంకటేశుఁ గని యందే శరణని విందుల నితరసేవావిముక్షే ముక్తి రేకు:0177-01 గుజ్జరి సంపుటము:02-382 పల్లవి: ఆర్తుఁడ నేను నీకడ్డ మెందును లేదు మూర్తిత్రయాత్మక మొగిఁ గరుణించవే చ. సర్వసాక్షివి నీవు సర్వాంతరంగుఁడవు సర్వసర్వంసహాచక్రవర్తి నిర్వాణమూర్తి నిగమాంతకీర్తి సర్వాపరాధములు క్షమియింపవే చ. పరమాత్ముఁడవు నీవు పరంజ్యోతివి నీవు