పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/186

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

184 వేసరి చానిపిం జవి వెదక నదిఁకనేల పూసివాసిఁ గైకొంట వొల్లకుంటే మానుట చ. మరపించుఁ దలపించు మరి యేమైనాఁ జేసు మరియును దనకర్మమహిమిది గురిగా శ్రీవేంకటేశుఁ గొలిచినవారి కిది వుఱకైనఁ గైకొంట వొల్లకుంటే మానుట రేకు:0089-04 సామంతంసంపుటము: 01-438 పల్లవి: ఆపద్బంధుఁడు హరి మాకుఁ గలఁడు దూపలి తలఁచినా దోషహరము చ. గరుడనినెక్కినఘనరేవంతుఁడు గరుడ కేతనముగలరథుఁడు గరుడఁడే తనకును గరియగు బాణము గరిమె నీతఁడేపో ఘనగారుడము చ. పాముపరపుపై బండినసిద్దుడు పాముపాశముల పరిపూరము పామున నమృతముఁ పడఁదచ్చినతఁడు వేమరు నీతఁడే విషహరము చ. కమలాక్షుఁ డీతఁడు కమలనాభుఁడును కమలాదేవికిఁ గైవశము అమరిన శ్రీవేంకటాధిపుడితఁడే మమతల మాకిదే మంత్రాషధము రేకు:0043-06 శ్రీరాగం సంపుటము: 01-266 పల్లవి: ఆపన్నులపాలి దైవమాతఁడే గతిఁదక్క యే పొద్దును భజియించఁగ నితరుఁడు మరి కలఁడా చ. నిరుపాథిక నిజబOధుఁడు నిరతి శయూనOదుఁడు కరి వరదుఁడితఁడే గాక ఘనుఁడధికుఁడు గలఁడా చ. సంతత గుణ సంపన్నుఁడు సాధులకుఁ బ్రసన్నుఁడు అంతర్యామితఁడే కాక అధికుఁడు మరి కలఁడా చ. పరమాత్ముఁడు పరమపురుషుఁడు పరికింపఁగఁ గృపాలుఁడు తిరువేంకట విభుఁడే కాక దేవుఁడు మరి కలఁడా రేకు:0107-01 సాళంగనాట సంపుటము: 02-037 పల్లవి: ఆమీఁది నిజసుఖ మరయలేము పామరపు చాయలకే భ్రమసితిమయ్యా చ. మనసునఁ బాలు దాగి మదియించి వున్నట్టు ననిచి గిలిగింతకు నవ్వినయట్టు యొనసి సంసారసుఖ మిది నిజము సేసుక తనివొంది యిందులోనే తడఁబడేమయ్యా చ. బొమ్మలాట నిజమంటాఁ బూఁచి చూచి మెచ్చినట్టు