పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/185

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

183 అదె దుస్సంగము అనే అడవులఁ దిరిగాడి పదరెగు కావవే పాండవవరద చ. పరికించ జీవుఁడనే పాషాణ మొకటి సరుగఁ గర్మమనే శాపము నొంది నిరతి శ్రీ వేంకటేశ నీపాదధూళి మోపి అరుదుగా నన్నుఁ గావు మహల్యవరదా పె.అ.రేకు:0021-05 లలిత సంపుటము: 15-121 పల్లవి: ఆనాది సంసారి వటుగాన మనోవికార మిది మాన దెంతయినా చ. కడు చంచలమేకాని కాయములో ನಿಜಬುದ್ದಿ తొడరదు దుర్బుద్ధి తోఁచి నాకు దిడువై (?) శ్రీహరి నీవు తిద్దితే నేమో కాని వెడఁగు నా గుణ విుది విడువ దెంతయునా చ. పలుచింతలే కాని పట్టిన నీపై భక్తి కలుగ దజ్ఞానమే కప్పీ నాకు బలిమి బందాలు నీవు నాపితే నేమో కాని తొలఁకు నా మన సిది తొరెలఁగ దెంతయునా చ. పట్టిన చలమే కాని పై పై విరక్తి నాకు నెట్టుకోదు నీ కృప నిలిచీ నాకు యిట్టే శ్రీ వేంకటేశ యేలిన వాఁడవు నీవు యెట్టెన నీకుఁ బోదు యెఱుఁగ నెంతయినా రేకు:0024-01 వరాళి సంపుటము: 01-143 పల్లవి: ఆపదల సంపదల నలయు టేమిట మాను రూపింప నిన్నిటను రోసిననుఁ గాక చ. కడలేనిదేహరోగంబు లేమిట మాను జడనువిడిపించునెషధసేవఁగాక విడవ కడియాస తను వేఁచు టేమిట మాను వొడలికలగుణమెల్ల నుడిగిననుఁగాక చ. దురితసంగ్రహమైన దుఃఖ మేమిట మాను సరిలేని సౌఖ్యంబు చవిగొన్నఁగాక కరుకైన మోహంధకార మేమిట మాను ఆరిది తేజోమార్గ మలవడినఁగాక చ. చావులోఁ బెనగొన్నజన్మ మేమిట మాను యీవలావలి కర్మ మెడసినఁ గాక భావింప నరుదైనబంధ మేమిట మాను శ్రీ వేంకటేశ్వరుని సేవచేఁ గాక రేకు: 0338-04 ఆహిరి సంపుటము:04-223 పల్లవి: ఆపదలులేని సుఖ మదియెపో విరతి వోపితేనే కైకొంట వొల్లకుంటే మానుట చ. అలిగించు ములిగించు నంతలోనే భ్రమయించు కొలఁది సంసారపుగుణ మిది మలసి రాలుదింటా మలిగండ్లననేల వొలిసితేఁ గైకొంట వొల్లకుంటే మానుట చ. ఆపపెట్టు మోసపెట్టు నంతలోనే వాసిపెట్టు గాసిల నీసిరులకు గల దిది