పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/184

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

182 సిసువై యవతరించి చెలఁగీనమ్మా ముసిముసి నవ్వులతో మునులకు ఋషులకు యిసుమంత వాఁడభయమిచ్చీనమ్మా చ. కన్న తల్లిదండ్రులకు కర్మపాశము లూడిచి అన్నిటా రాకాసిమూఁక లణఁచీనమ్మా వున్నతి శ్రీవేంకటాద్రినుండి లక్షీదేవితోడ పన్ని నిచ్చకల్యాణాలఁ బరగీనమ్మా రేకు:0287-03 బౌళి సంపుటము: 03–502 పల్లవి: ఆనందనిలయ ప్రపదవరదా భానుశశినేత్ర జయ ప్రపదవరదా చ. పరమపురుష నిత్య ప్రపదవరదా హరి యచ్యుతానంత ప్రహ్లాదవరదా పరిపూర్ణ గోవింద ప్రహ్లాదవరదా భరిత కల్యాణగుణ ప్రహ్లాదవరదా చ. భవరోగసంహరణ ప్రహ్లాదవరదా అవిరళ కేశవ ప్రపదవరదా పవమాననుతకీర్తి ప్రహ్లాదవరదా భవపితామహవంద్య ప్రపదవరదా చ. బలయుక్త నరసింహ ప్రపదవరదా లలిత శ్రీవేంకటాద్రి ప్రపదవరదా ఫలితకరుణారస ప్రహ్లాదవరదా బలివంశ కారణ ప్రపదవరదా రేకు:0163-01 సామంతం సంపుటము: 02-301 పల్లవి: ఆనతియ్యఁగదవే అందుకే కాచుకున్నాఁడను పూనుక నీవెంత నేర్పరివైనా భువి మనసు పేదను నేను చ. కొలిచేమనే బంట్లు నీకుఁ గోటానఁగోట్లు గలరు నిన్నుఁ దెలిసేమనే జ్ఞానులు తెందేపలున్నారు తలఁచి వరములడిగేవారలు తలవెంట్రుకలందరు వారె యిల సందడిలో నాకొలువు యెటువలె నెక్కీనో చ. పనులకుఁ బాల్పడినవారు బ్రహ్మాదిదేవతలట వినుతులు సేయఁ దొడంగినవె వేదరాసులట మునుకొని ధ్యానించువారు మునులెందరైనాఁ గలరట వినయపు నామనవి సనవులకు వేళ లెపుడు గలిగీనో చ. వున్నతితోడుత నిన్ను మోఁచుటకు వున్నారు గరుఁడఁడు శేషుఁడు నీకు అన్నిటాను నీకాంగిటిలోపల నలరీ నలమేల్మంగ యెన్నఁగ శ్రీవేంకటేశా నన్నును యేలితి వింతటిలోనే పన్నిన నా మొక్కులు నీ కేబాగులఁ జేరినో పె.అ.రేకు : 0034-05 మలహరి సంపుటము: 15-193 పల్లవి: ఆనాథులఁ గాచుట అలవాటే తొల్లే నీకు వినోదములు గావు విభీషణవరదా చ. మలసి నా చిత్తమనే మదమునేనుగ యిదె జలజావాసపు సంసారములోని అలయరాజద్వారమను మొసలిచే పడె కలిగి కావఁగదె కలిరాజవరద చ. తుద పంచప్రాణములతోడఁ బుట్టువు లెగురు కదిసి దేహమనేటికాంతఁ బెండ్లియాడి