పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/183

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

181 అనువునం గురసీ నపారము వనితలు నందవ్రజమునఁ జెలఁగఁగ మనికికి నిరవై మలసీ వీఁడే చ. పరమునకునుఁ దాఁ బరమై వెలసిన పరిపూర్ణ పరాత్పరుఁడు సరుస రుక్మిణికి సత్యభామకును వరుఁడగు వేంకటవరదుఁడు వీఁడే రేకు: 0390-05 శంకరాభరణం సంపుటము: 04-524 పల్లవి: ఆదిమూర్తి యీతఁడు ప్రహ్లాద వరదుఁడు యేదెనఁ జూచినాఁ దానె యీతఁడిది దేవుఁడు చ. నవ్వుల మోము తోడ నరసింహ రూపు తోడ జవ్వని తొడ మీఁదట సరస మాడ పువ్వుల దండలు యిరు బుజాలపై వేసుకొని వువ్విళ్ళూరఁ గొలువై వున్నాఁడు దేవుఁడు చ. సంకుఁ జక్రములతోడ జమళి కోరల తోడ అంకెలఁ గటియభయహస్తా లెత్తి కంకణాలహారాలతో ఘన కిరీటము వెట్టి పొంకమైన ప్రతాపానఁ బొదిలీ నీ దేవుఁడు చ. నానా దేవతల తోడ నారదాదుల తోడ గానములు వినుకొంటా గద్దెపై నుండి ఆనుక శ్రీ వేంకటాద్రి నహో బలము నందు తానకమై వరాలిచ్చీ దాసులకు దేవుఁడు రేకు: 0309-01 ముఖారి సంపుటము:04-049 పల్లవి: ఆదిమూలమే మాకు నంగరక్ష శ్రీదేవుఁడే మాకు జీవరక్ష చ. భూమిదేవిపతి యైన పురుషోత్తముఁడె మాకు భూమిపై నేడ నుండినా భూమిరక్ష ఆమని జలధిశాయి అయిన దేవుఁడే మాకు సామీప్యమందున్న జలరక్ష చ. మైయుచు నగ్నిలో యజ్ఞమూర్తియైన దేవుఁడే ఆయములు దాఁకకుండా నగ్నిరక్ష వాయుసుతు నేలినట్టి వనజనాభుఁడే మాకు వాయువందుఁ గందకుండా వాయురక్ష చ. పాదమాకసమునకుఁ బారఁజాఁచే విష్ణువే గాదిలియై మాకు నాకాశరక్ష సాదించి శ్రీవేంకటాద్రి సర్వేశ్వరుఁడే మాకు సాదరము విూరినట్టి సర్వరక్షా రేకు:0234-02 లలిత సంపుటము: 03-193 పల్లవి: ఆదివిషు వీతఁడే యటరమ్మా ఆదిగొని భూభార మణఁచీనోయమ్మా చ. చందురునుదయవేళ సవరేతిలికాడ కందువ దేవకి బిడ్డఁ గనెనమ్మా పొందుగ బ్రహ్మాదులు పురుఁటింటి వాకిటను చెంది బాలుని నుతులు సేసేరోయమ్మా చ. వసుదేవుని యెదుట వైకుంఠనాథుఁడు