పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/182

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

180 యిక్కడనే మొక్కఁగా నీ వేమందువో దిక్కు నీ వుండఁగాఁ బరదేవతలఁ గొలిచితి నెక్కొని రక్షించు మంటే నీ విఁక నేమందువో చ. తొట్టి కామక్రోధాలతో దూరు లెల్లాఁ గట్టుకొంటి యిట్టె ముద్ర మోచే నంటే నేమందువో నెట్టన శ్రీవేంకటేశ నీకు నలమేల్మంగకు గట్టిగా నే లెంక నైతి కరుణించేమందువో రేకు:0288-02 సాళంగనాట సంపుటము: 03-507 పల్లవి: ఆదిమపురుషుడు అహోబలమునను వేదాద్రిగుహలో వెలసీ వాఁడే చ. వుదయించె నదిగో వుక్కుఁ గంభమున చెదరక శ్రీనరసింహుడు కదిసి హిరణ్యుని ఖండించి ప్రపదునెదుట గద్దెపై నిరవై నిలిచె చ. పాడచూపె నదిగో భువి దేవతలకు చిడుముడి శ్రీనరసింహుఁడు అడర నందరికి నభయం బొసగుచు నిడుకొనెఁ దొడపై నిందిరను చ. సేవలు గొనె నదె చెలఁగి సురలచే శ్రీవేంకటనరసింహుడు దైవమై మమ్మేలి దాసుల రక్షించె తావుకొనఁగ నిటు దయతోఁ జూచి రేకు:0013-04 శంకరాభరణం సంపుటము: 01-080 పల్లవి: ఆదిమపూరుషుఁ డచ్యుతుఁడచలుఁడనంతుఁడమలుఁడు ఆదేవుఁ డీతఁడేపోహరి వేంకటవిభుఁడు చ. ఏకార్ణవమై ఉదకములేచిన బ్రహ్మాండములోఁ బైకొని యుండఁగ నొక వటపత్రములోపలను చేకొని పవళింపుచు నొక శిశువై వడిఁదేలాడినశ్రీకాంతుఁ డీతఁడేపో శ్రీవేంకటవిభుఁడు చ. అరుదుగ బలిమద ముడఁపఁగ నాకసమOటిన రూపము సరుగన భూమిOత్రయు నోరెక చరణంబున గొలచి పరగిన పాదాంగుటమున బ్రహ్మాండము నగిలించిన పరమాత్ముఁ డీతఁడేపో పతి శ్రీవేంకటవిభుఁడు చ. క్షీరపయోనిధి లోపల శేషుఁడు పర్యంకముగా ధారుణియును సిరియునుఁ బాదము లొత్తంగను చేరువఁదను బ్రహ్మాదులు సేవింపఁగఁ జెలుఁవొందెడి నారాయణుఁ డితఁడే వున్నత వేంకటవిభుఁడు రేకు:0043-01 ధన్నాశి సంపుటము: 01-261 పల్లవి: ఆదిమునుల సిద్ధాంజనము యేదెసఁ జూచిన నిదివో వీఁడే చ. నగిన సెలవిఁ బడు నాలుగుజగములు మొగమునఁ జూపే మోహనము నిగిడి యశోదకు నిధానంబై పొగడొందీ గృహమున నిదె వీఁడే చ. కనుదెరచిన నలుగడ నమృతము లటు