పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/181

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

179 పల్లవి: ఆదిదేవుఁడనఁగ మొదలు నవతరించి జలది సాచ్చి వేదములును శాస్త్రములును వెదకి తెచ్చె నీతఁడు చ. వాలి తిరుగునట్టి దైత్యవరుల మోహవతులనెల్ల మూలమూలఁ ద్రోసి ముసుఁగుపాలు సేసె నీతఁడు వేలంఖ్యలైనసతుల వేడుకలలరఁజేసి వొంటి నాలిమగనిరీతిఁ గూడి యనభవించె నీతఁడు చ. కడుపులోని జగములెల్లఁ గదలకుండఁ బాఁపరేనిపడుక నొక్కమనసుతోడఁ బవ్వళించె నీతఁడు అడుగుకింద లోకమెల్ల నడఁచఁదలఁచి గుఱుతుమీర పొడవు వెరిగి మిన్నుజలము పొడిచి తెచ్చె నీతఁడు చ. కోడెవయసునాఁడు మంచి గోపసతుల మనములెల్ల ఆడి కెలకు నోప కొల్లలాడి బ్రదికె నీతఁడు వేడుకలర వేంకటాద్రి వెలసి భూతకోటి దన్నుఁ జూడుఁడనుచు మోక్షపదము చూరవిడిచె నీతఁడు రేకు:0021-03 సామంతంసంపుటము: 01-127 పల్లవి: ఆదిదేవుఁడై అందరిపాలిటి కీ దేవుఁడై వచ్చె నితఁడు చ. కోరిన పరమ యోగుల చిత్తములలోన యేరీతి నుండెనో యీతఁడు చేరవచ్చిన యాశ్రితులనెల్లఁ బ్రోవ యీరీతి నున్న వాఁడీతడు చ. కుటిల దానవుల కోటానఁగోట్ల యెటువలెఁ ద్రుంచెనో యీతఁడు ఘటియించి యిటువంటి కారుణ్యరూపుఁడై యిటువలె నున్న వాఁడీతడు చ. తక్కక్క బ్రహ్మాండ తతులెల్ల మోచితా నెక్కడ నుండెనో యీతఁడు దిక్కుల వెలసిన తిరువేంకటేశుఁడై యిక్కడ నున్న వాఁడీతఁడు పె.శ్రీ.అ.రేకు:0078-1 సాళంగనాట సంపుటము: 15-447 ల్లవి: ఆదినారాయణ నాకు నభయ మీవె కాదని తప్పులెంచక కరుణానిధీ చ. తుదకెక్క నింద్రియపు దొంగలకుఁ దాపిచ్చితి యెదుటికి రాఁగా నీ వే ముందువో మదించి నాలో నుండఁగా మఱచితి నే నిన్ను యిదె కాను కియ్యఁగా నీ వేమందువో చ. పక్కన నీ యాజ్ఞ దోసి పాపము లెల్లాఁ జేసితి ప