పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/178

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

176 కమలాపనిలోనఁ గలిగి మెరయువాఁడు కమలనాభుఁడేపో కలుగు మాదైవము చ. జలధి బO8)Oచి లOక సంపూరించినవాఁడు జలధి చొచ్చినదైత్యుఁజంపినవాఁడు జలధిసుతునకు వరుస బావైనవాఁడు జలధి శయనుఁడేపో చక్కని మాదైవము చ. కొండ గొడుగుగనెత్తి గోవులఁగాచినవాఁడు కొండవంటి రాకాసిఁ గొట్టినవాఁడు కొండలకు నెక్కుడైన గురుతు శ్రీవేంకటాద్రికొండరూపు దానేపాణి కోరిన మాదైవము రేకు: 0324-06 శంకరాభరణం సంపుటము: 04-141 పల్లవి: ఆతడాఁ యీతఁడు పెద్దహనుమంతుఁడు చేతులారా నక్షునిఁ జెండివేసినాఁడట చ. తొలుత రాముని గాంచి తోడనే సుగ్రీవుని కొలువఁ బెట్టి యాతనికొమ్మనిప్పించి జలనిధి దాఁటి లంక సాధించి చొచ్చి సీతకునలర నుంగర మిచ్చె నతిసాహసమున చ. సీతాదేవి యానవాలు శ్రీరామునికి నిచ్చి నీతి విభీషణుని మన్నించజేసి చేతులనే పాశీటూడి చెండివేసి రాక్షసుల ఘాతల సంజీవికొండగక్కనఁ దాఁ దెచ్చెను చ. గక్కన రావణుఁ గొట్టి కాంతను రాముని గూర్చి అక్కడ నయోధ్యఁ బట్ట మటుగట్టి నిక్కి కలశాపురిని నిండి శ్రీవేంకటాద్రిని వుక్కమీరి హరిఁగొల్చి వున్నాఁడు వేడుకల రేకు: 0197-04 రామక్రియ సంపుటము: 02-499 పల్లవి: ఆతనిఁబో పొగడేము ఆతని శరణంటిమి ఆతఁడే సర్వజీవుల అంతర్యామి చ. పెక్కు బ్రహ్మాండకోట్లు పెక్కు బ్రహ్మకోట్లు పెక్కు రుద్రకోట్లును పెక్కు యింద్రులు వొక్కొక్క రోమకూపాల నొగి నించుకుండునట్టి వొక్కఁడే విష్ణుఁడు వీఁడే వున్నతోన్నతుఁడు చ. అనంత సూర్యచంద్రులు అనంత వాయువులును అనంత నక్షత్రము లనంత మేరువులు కొనలు సాగీ నన్నిటి కూటువఁ గూడుకొన్నట్టి అనంతుఁడొక్కఁడే మించీ నాదిమూరితి చ. అసంఖ్యమహిమలను అసంఖ్యమాయలు అసంఖ్యశక్తులు వరాలసంఖ్యములు పొసఁగ నిన్నిటిఁ దానే పుట్టించి రక్షించినట్టి అసంఖ్యాతుఁడు శ్రీవేంకటాద్రీశుఁడు రేకు:0090-04 గుజ్జరి సంపుటము:01-444 పల్లవి: ఆతనినే నే కొలిచి నే నందితిఁ బో నిజసుఖము శ్రీతరుణీపతి మాయాధవుఁడు సృష్టియింతయును హరి మూలము చ. కోరుదుమా దుఁఖములు కోర కేతెంచు తముఁదామే ఆరీతులనే సుఖములు యేతెంచు నందును విచార మంతేల