పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/179

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

177 సారేకు దైవాధీనము లివి రెండు స్వయత్నములుగా వెవ్వరికి కోరేటి దొకటే హరిశరణాగతి గోవిందుఁడే యింతకు మూలము చ. కమ్మంటిమా ప్రపంచము గలిగీ స్వభావము అందుకది యిమ్ముల మోక్షము యీరీతులనే యీశ్వరుఁడిచ్చిన యిది గలుగు కమ్మి అంతర్యామికల్పితంబు లివి కాదననవుననరా దెవ్వరికి సమ్మతించి ఆసపడియెడి దొకటే సర్వలోకపతి నిజదాస్యము చ. సరి నెఱఁగుదుమా పోయినజన్మము సారేకు నేమేమి చేసితిమా యిరవుగ నట్లా మీదఁటిజన్మముయెఱుకలు మఱపులు యిఁకనేలా నిరతమై శ్రీవేంకటేశుఁడు తనయిచ్చ నిర్మించిన దిది యీదేహము గరిమెల నాతనికైంకర్యమెపా8 కలకాలము మాకు కాణాచి రేకు: 0174-01 లలిత సంపుటము:02-362 పల్లవి: ఆతనిమూలమే జగమంతా నిది ఆతుమలో హరి కీలుఅయివుండుఁ గాని చ. మచ్చరము లేకున్నను మనసే రామరాజ్యము వచ్చినట్టె వచ్చితేను వలపే చవి యొచ్చుకుందు లేకున్న నెక్కడైనా సుఖమే యిచ్చకుఁడై హరి తన కియ్యవలెఁ గాని చ. నెట్టుకొని నడచితే నిజమే మూలధనము పట్టినదే వ్రతమైతే భవమే మేలు జట్టిగా నొనగూడితే సంసారమే ఫలము యిట్టి హరి దనకు నియ్యవలెఁ గాని చ. చెప్పినట్లు సేసితేను చేరి దేహమే చుట్టము తప్పులు లేనిదియైతే ధర్మమే సామ్మ చొప్పున హరిదాసులు సోదించి చూచిన దిది యెప్పుడు శ్రీవేంకటేశుఁ డియ్యవలెఁ గాని రేకు:0079-03 లలిత సంపుటము: 01-378 పల్లవి: ఆతుమ సంతసపెట్టుటది యెఱుక, తా నేతెరవు నొల్లకుండు టిదియే యెఱుక చ. ముంచినబంధములలో ముణుఁగుడువడక తా నంచల విడఁదన్ను టది యెఱుక చంచలపు విషయూల సగ్గుడుముగుడుగాక యెంచిఁ హరిఁదలపాణియు టిదియే యెఱుక చ. పాయనియర్ధములకు బంటుబంటై తిరుగక ఆయతమై మోసపోని దది యెఱుక పాయపుఁగామినులతోఁ బలుమారుఁ జేయుపొందు హేయమనితలపాణియు టిదియే యెఱుక చ. ధరమీఁదఁగల ప్రాణితతుల నొప్పించక ఆరయఁగ సముఁడగు టది యుఱుక గరిమల శ్రీవేంకటపతిదాసుఁడై యిరవొంద సుఖించు టిదియే యెఱుక పె.అ.రేకు:0015-01 లలిత సంపుటము: 15-081 పల్లవి: ఆతుమ సంతోసపెట్టు టది యెఱుక తా నే తెరువు వొల్లకుండు టిదియె యెఱుక చ. ముOచిన బOధముల మునుఁగువడక తా నంచల విడఁ దన్నుటది యెఱుక చంచలపు విషయాల సగుడు ముగుడు గాక