పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/177

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

175 కోలుముందై తండ్రిగల కొడుకు కేది తొడుసు యీలీల హరిదాసుని కెక్కడికోరికెలు చ. బలుదుర్గము వానికి భయ మేమిటా లేదు కలిమిగలవానికి కడము లేదు యిల క్షేత్రవంతునికి నెందూ దరిద్రము లేదు అల శ్రీపతిబంట్లకు నలమట లేదు చ. పట్టిన ముద్రుంగరపు ప్రధాని కెదురు లేదు కుట్టి చాతనికివారికిఁ గొంకు లేదు నెట్టిన శ్రీవేంకటాద్రినిలయు సేవకులము గుట్టుతోడ బ్రదికేము గుణి మాకు నతఁడే రేకు:0228-05 భైరవి సంపుటము: 03-160 పల్లవి: ఆతఁడే యిన్నియు నిచ్చు నడిగినవల్లను చేతిలోనే వుండఁగాను చింతించరు హరిని చ. వలెనంటే సంపదలు వట్టి యలమటఁబెట్టు అలసి వోపనంటేను అండనే వుండు తలఁచి యిందరు నీతరితీపులఁ జిక్కి తలఁచ రెందును బరతత్త్యమైన హరిని చ. ఆసపడితే నింతులు అన్నిటాను బిగుతురు వాసితో నుంటేనే తామే వత్తు రొద్దికి పాకిసరించి యిందరు నీ పొందుల భ్రమలఁ బడి పాసి వున్నారదే తమ పతియైన హరిని చ. గట్టిగా రాతిరెల్లాను కలయైయుండు జగము పట్టపగలైతే తమ పాల నుండును బట్టబయలు పందిలి పెట్టేరుగాని చేపట్టరు శ్రీవేంకటాద్రిపెనున్న హరిని రేకు: 0166-03 బైరవి సంపుటము:02-319 పల్లవి: ఆతఁడే విష్ణుం డఖలము నడపెడి యీతల నెవ్వరి కేఁటికిఁ జింతా చ. పుట్టించఁ బెంచఁగ పొడవెక్కించ దేహుల గట్టిగా మూఁటలాడించఁ గదలించ పట్టి వాన గురియించ పైరులు మొలపించ తిట్ట పెట్ట నొకానొకదేవుఁడు గలఁడు చ. అన్నపానము లొంగ నాపదలు గడపఁగ పన్ని మాయలు భువిఁ బచరించ విన్నపాలు సురలవి విని యందరి రక్షింప వున్నతోన్నతుఁడై వొకానొకకర్త గలఁడు చ. కాల మక్షయము సేయ కర్మము ఫలించఁజేయ తాళుకొని మరపించఁ దలంపించ పాలుపడి శ్రీవేంకటపతియై వేదాలుచెప్పేయేలిక యొకానొక యీశ్వరుఁడు గలఁడు రేకు: 0319-04 మాళవి సంపుటము:04-109 పల్లవి: ఆతఁడోపో మాయేలిక ఆతఁడే జగన్మూల మాతఁడే శ్రీవేంకటాద్రి యందు మీఁది దైవము చ. కమలవాసిని యైన కాంతఁ బెండ్లాడినాఁడు కమలములో బిడ్డఁగన్నవాఁడు