పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/176

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

174 తోవ చూపె మనకు తొల్లే ఆచార్యుఁడు కావలసినట్లయిన్యాఁ గలఁగకుఁ డిఁకను చ. కాలమా వేగిరంచకు కర్మమా నన్నుమీరకు పాలించ దైవానకు నే భార మిఁకను ఆలించి తిరుమంత్రమే ఆతని నన్నుఁ గూరిచె వేళగాని అందాఁకా వేసరకుఁ డిఁకను చ. వెఱవకు దేహమా వేసరకు ధ్యానమా యెఱిఁగి శ్రీవేంకటేశుఁ డెడసిపోఁడు తఱి నిహపరము లితనిదాసు లిచ్చిరి గుణియైతి నిన్నిటికిఁ గొంకకుఁడీ ఇఁకను రేకు:0251-02 రామక్రియ సంపుటము: 03-291 పల్లవి: ఆతఁడు సేసే చేఁత లన్యులు సేయఁగలరా జాతుల మనుజులెల్లా సతమయ్యేరా చ. దిక్కులేనివారికెల్లా దేవుఁ డొక్కఁడే దిక్కు చిక్కినవారికినెల్లా శ్రీపతే గతి తక్కిన అనాథులకు దైవమే రక్షకుఁడు యొక్కడా నాతఁ డుండఁగా నేఁటికిఁక చింత చ. బలిమి లేనివారికి పరమాత్ముఁడే బలిమి కలిమి చాలని వాలి కలిమి పూరె యిల నేరనివారికి నిందిరానాథుఁడే నేర్పు వెలసీతనికే విన్నవించుటింతే కాక చ. పొందులేనివారికెల్లాఁ బురుషోత్తముఁడే పొందు విందును వేడుకయు శ్రీవేంకటేశుఁడే యెందరెందరుండినాను యూత్రcడు గలఁడు మూకు సందడి నాతఁడే అన్ని చక్కఁబెట్టీఁ బనులు రేకు:0262-04 దేసాళం సంపుటము: 03-358 పల్లవి: ఆతఁడే బ్రహ్మణ్యదైవ మాదిమూలమైనవాఁడు ఆతని మానుటలెల్లా నవిధిపూర్వకము చ. యెవ్వని పేరఁ బిలుతు రిలఁ బుట్టిన జీవుల నవ్వుచు మాసనక్షత్రనామములను అవ్వల నెవ్వని కేశవాదినామములే రవ్వగా నాచమనాలు రచియింతురు చ. అచ్చ మే దేవుని నారాయణనామమే గతి చచ్చేటివారికి సన్యాసమువారికి ఇచ్చ నెవ్వరిఁ దలఁచి యిత్తురు పితాళ్లకు ముచ్చట నెవ్వని నామములనే సంకల్పము చ. నారదుఁడు దలఁచేటి నామమది యెవ్వనిది గౌరి నుడిగేటి నామకథ యేడది తారకమై బ్రహ్మరుద్రతతి కెవ్వరినామము యీ రీతి శ్రీవేంకటాద్రి నెవ్వఁడిచ్చీ వరము రేకు: 0151-03 ముఖారి సంపుటము: 02-237 పల్లవి: ఆతఁడే యజమానుఁడు ఆదినారాయణుఁడు ఆతని బంట్లము మాకు నన్నిటా నిశ్చింతము చ. యేలికెగల బంటుకు యొక్కడిది విచారము పాలించే మగఁడుగల పడఁతి కేడ చింత